Weight Gain : చికెన్ తింటున్నారా..? ఈ భాగాలు తింటే బరువు పెరగడం ఖాయం.. జాగ్రత్త..!

సాక్షి లైఫ్ : చికెన్ అనగానే మనకు ప్రోటీన్ గుర్తుకు వస్తుంది. అయితే చికెన్‌లోని అన్ని భాగాలు సమానమైన పోషకాలను అందించవు. కొన్ని భాగాల్లో ప్రోటీన్ కంటే కొవ్వు శాతమే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడం కష్టమవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చికెన్ కొనేటప్పుడు, వండేటప్పుడు పలు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.మాంసాహారులకు చికెన్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రోటీన్ పుష్కలంగా ఉండే చికెన్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. దానిలోని కొన్ని భాగాలు మాత్రం ఊబకాయానికి దారితీస్తాయని మీకు తెలుసా..? బరువు తగ్గాలనుకునే వారు ఏ భాగాలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 

ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం..

1. చికెన్ చర్మం (Skin).. 

చికెన్‌లో అత్యధిక కొవ్వు ఉండే భాగం చర్మం. ఇందులో సంతృప్త కొవ్వు (Saturated Fat) కేలరీలు చాలా ఎక్కువ. చర్మంతో కలిపి వండిన మాంసం రుచిగా ఉన్నప్పటికీ, అది కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా 'స్కిన్‌లెస్' చికెన్‌నే ఎంచుకోవాలి.

2. చికెన్ తొడలు (Thighs)..

లెగ్ పీస్, థైస్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, బ్రెస్ట్ పీస్ తో పోలిస్తే తొడ భాగంలో కొవ్వు శాతం అధికం. వీటిని వేయించి (Fry) తినడం వల్ల శరీరంలోకి అనవసర కేలరీలు చేరుతాయి. వీటిని తినాలనుకుంటే పరిమితంగా తీసుకోవడం లేదా ఉడికించి, గ్రిల్ చేసి తీసుకోవడం ఉత్తమం.

3. ఎముకల దగ్గరి మాంసం..

కీళ్లు,ఎముకల చుట్టూ ఉండే మాంసం మెత్తగా, రుచిగా ఉంటుంది కానీ అక్కడ కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. అధిక కేలరీలు వద్దనుకునే వారు ఈ భాగాలను తక్కువగా తీసుకోవాలి.

4. అంతర్గత అవయవాలు (Organ Meat)..

మెడ, గుండె, కాలేయం (Liver) వంటి భాగాలలో ఐరన్, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిలో కేలరీలు కూడా ఎక్కువే. ముఖ్యంగా కాలేయాన్ని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీల మోతాదు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

మరి ఏ భాగం ఆరోగ్యకరం..?

చికెన్‌లో అత్యంత పోషకమైన భాగం 'చికెన్ బ్రెస్ట్' వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండి, ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

 చికెన్ ముక్కలను నూనెలో వేయించడం కంటే బేక్ చేయడం, ఉడికించడం లేదా గ్రిల్ చేయడం వల్ల పూర్తిస్థాయి పోషకాలను పొందవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకోకుండా కేవలం వ్యాయామం చేస్తే ఆశించిన ఫలితం ఉండదు. కాబట్టి, చికెన్ ప్రియులు సరైన భాగాలను ఎంచుకుని ఆరోగ్యంగా ఉండండి.

 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : over-weight chicken chicken-liver chicken-liver-benefits chicken-live chicken-liver-fry chicken-diseases
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com