సాక్షి లైఫ్ : మన ఆరోగ్యానికి పరిశుభ్రతే మొదటి రక్షణ కవచం. అత్యంత సులువైన, ప్రభావవంతమైన అలవాటు ఏదైనా ఉందంటే అది చేతులు కడుక్కోవడమే. అపరిశుభ్రమైన చేతులు అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు మూలమని, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!
చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల సూక్ష్మక్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల.. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కలరా వంటి సమస్యలు తలెత్తుతాయి.
శ్వాసకోశ ఇబ్బందులు.. జలుబు, దగ్గు,ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు త్వరగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
చేతులు కడుక్కోవడానికి సరైన పద్ధతి ఇదే..
కేవలం నీళ్లతో చేతులు కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిములు నశించవు. సబ్బుతో శాస్త్రీయంగా కడుక్కోవడం ద్వారానే పూర్తి రక్షణ లభిస్తుంది.
తడపడం..ముందుగా చేతులను శుభ్రమైన నీటితో తడపాలి.
సబ్బు వాడకం.. తగినంత సబ్బును తీసుకుని అరచేతులు, వేళ్ల మధ్య భాగాల్లో బాగా రుద్దాలి.
20 సెకన్ల నియమం.. కనీసం 20 సెకన్ల పాటు చేతులను మణికట్టు వరకు శుభ్రం చేయాలి. ముఖ్యంగా గోళ్ల కింద, వేళ్ల సందుల్లో బ్యాక్టీరియా చేరకుండా చూసుకోవాలి.
శుభ్రం చేయడం..ఆ తర్వాత నీటితో పూర్తిగా కడిగేసి, పొడి తువాలు లేదా డ్రైయర్‌తో ఆరబెట్టుకోవాలి.
ఎప్పుడు కడుక్కోవాలి..?
ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత.
టాయిలెట్ ఉపయోగించిన ప్రతిసారీ.
బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే.
తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు చేతులను అడ్డుపెట్టుకుంటే వెంటనే కడుక్కోవాలి.
జంతువులను తాకినప్పుడు లేదా చెత్తను శుభ్రం చేసిన తర్వాత.
పిల్లలకు అవగాహన అవసరం..
చిన్నప్పటి నుంచే పిల్లలకు చేతులు కడుక్కోవడంలోని ప్రాముఖ్యతను వివరించాలి. పాఠశాలల్లో, ఇంట్లో ఈ అలవాటును ఒక క్రతువులా నేర్పించడం ద్వారా వారిని అనేక అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఈ చిన్న అలవాటు మీ కుటుంబానికి పెద్ద ఆరోగ్య భరోసాను ఇస్తుంది. పరిశుభ్రతను పాటిద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దాం..!
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com