Functional Dyspepsia : ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే ఏమిటి..? పరిష్కారం ఏమిటి..? 

షేర్ చేయండి:
Functional Dyspepsia : ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే ఏమిటి..? పరిష్కారం ఏమిటి..? 

సాక్షి లైఫ్ : ప్రస్తుత జనరేషన్ లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జీర్ణక్రియ లోపం. బిజీ లైఫ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, నొప్పి, వికారం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వైద్య పరిభాషలో దీనిని 'ఫంక్షనల్ డిస్పెప్సియా' (Functional Dyspepsia) అని పిలుస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు 10 నుంచి 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ఈ నేపథ్యంలో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, తిన్న తర్వాత ఉపశమనం కలిగించే సరికొత్త 'పూల్‌జైమ్' (Poolzyme) ఎంజైమ్ సప్లిమెంట్లను జీలెప్పీ (Giellepi) సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

వివిధ రకాల ఆహారాల కోసం.. ప్రత్యేక ఎంజైమ్స్.. 

మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి మన శరీరానికి వేర్వేరు ఎంజైమ్‌లు అవసరమవుతాయి. ఇందుకోసం పూల్‌జైమ్ శ్రేణిలో ప్రత్యేకమైన సప్లిమెంట్లను రూపొందించారు. 

1. పూల్‌జైమ్ మల్టీ (Poolzyme Multi) జీర్ణక్రియకోసం..ఇది శాఖాహార ఎంజైమ్‌ల కలయికతో రూపొందించారు. భారీ భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపు ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లను సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, రాత్రి వేళల్లో మంచి నిద్ర పట్టేలా చేస్తుందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా రుజువైంది.

2. పూల్‌జైమ్ డెయిరీ (Poolzyme Dairy)..పాల ఉత్పత్తుల కోసం.. పాలు, పాల పదార్థాలు తిన్నప్పుడు కడుపులో గ్యాస్, అజీర్తితో బాధపడేవారి కోసం దీనిని తయారుచేశారు. ఇందులో ఉండే లాక్టేస్, ప్రోటీయేస్ ఎంజైమ్‌లు పాలలో ఉండే చక్కెరలను, ప్రొటీన్లను వేగంగా విచ్ఛిన్నం చేసి అజీర్తిని దూరం చేస్తాయి.

3. పూల్‌జైమ్ వెజ్ (Poolzyme Veg)..శాఖాహారుల కోసం.. చిక్కుళ్ళు, తృణధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తినే వారికి వీటిలోని పీచు పదార్థాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. ఈ సప్లిమెంట్‌లో ఉండే 5 రకాల ప్రత్యేక శిలీంధ్రాల (Fungal) ఎంజైమ్‌లు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సులువుగా జీర్ణం చేస్తాయి.

4. పూల్‌జైమ్ కీటో (Poolzyme Keto).. అధిక కొవ్వు ఆహారాల కోసం..బరువు తగ్గడానికి కీటో డైట్ అంటే ఎక్కువ కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లు పాటించే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని 'లైపేస్' ఎంజైమ్, కడుపులోని ఆమ్ల గుణంలో కూడా కొవ్వు పదార్థాలను సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది.

పరిశోధనల్లో తేలిన నిజం.. 

సాధారణంగా జీర్ణక్రియ సమస్యలకు వాడే యాంటాసిడ్లు లేదా ఇతర మందుల వల్ల కొన్నిసార్లు దుష్ప్రభావాలు (Side effects) వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, సహజమైన పద్ధతిలో సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ (Microbial Fermentation) ద్వారా తయారుచేసిన ఈ సప్లిమెంట్లు సురక్షితమైనవని పరిశోధకులు తేల్చారు. ఇవి శరీరంలో ప్రోటీన్లు, కొవ్వుల విచ్ఛిన్నతను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయని క్లినికల్ అండ్ ప్రీ క్లినికల్ పరీక్షల్లో స్పష్టమైంది.  

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.