సాక్షి లైఫ్ : మన ఆహారపు అలవాట్లు మనం నిత్యం సరదాగా తినే జంక్ ఫుడ్డే కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఇటీవల యువకుల్లో సైతం గుండెపై బాగా ప్రభావం కనిపిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా గుండెపోటుతో చనిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇంతకీ మనం వంటల కోసం వినియోగించే పామాయిల్ ఆరోగ్యానికి ప్రమాదకరమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ఎక్కువ హానికరం..
పామాయిల్ ఎంత డేంజరంటే మద్యం సేవించడం సిగరెట్ తాగడం వల్ల కలిగే అనర్ధాల కంటే పామాయిల్ తో తయారైన పదార్థాలను తినడం వల్ల ఎక్కువ హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. పామాయిల్ ఇంతగా పాపులర్ అవడానికి వెనుక దేశవిదేశాల్లో తెరవెనుక పని చేసే పెద్ద మాఫియా ఉందని చెబుతున్నారు పరిశోధకులు.
పాస్ట్ పుడ్ సెంటర్లలో..
ప్రస్తుతం అన్ని పాస్ట్ పుడ్ సెంటర్లలో పామాయిల్ మాత్రమే వాడుతున్నారు. మిగిలిన నూనెల కన్నా పామాయిల్ ధర తక్కువగా ఉండటం, ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పామాయిల్ వినియోగించడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనించాల్సిన విషయం..
పెద్ద పెద్ద కంపెనీలు అన్ని బిస్కెట్, కుకీలు, చాక్లెట్లు తయారీలో పామాయిల్ ను వాడుతున్నారు. లేస్ అనే పాపులర్ చిప్స్ కంపెనీ తమ ఉత్పత్తుల తయారీలో వంద శాతం పామాయిల్ నే వాడుతున్నారు. విదేశాల్లో ఇదే కంపెనీ పామాయిల్ జోలికి వెళ్లకపోవడం గమనించాల్సిన విషయం. పామాయిల్ తో చేసిన జంక్ ఫుడ్ కారణంగా జనం వాటికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు.
పరిశోధకులు..
విదేశాల్లో ఆహార పదార్థాల విషయంలో రూపుదిద్దుకున్న చట్టాలు కఠినంగా ఉంటాయి. పామాయిల్ లో ఉండే పాల్మిటిక్ యాసిడ్ మనిషి ప్రాణాలను తీస్తుందని పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. పామాయిల్ తో చేసిన పదార్థాలు పిల్లల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, చిన్న వయసులోనే డయాబెటిస్ గుండె జబ్బులూ రావడానికి కూడా కారణం ఇదేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అధ్యయనం ప్రకారం..
ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో సగం మరణాలు డయాబెటిస్ గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి. పామాయిల్ ను బాగా కండ పట్టి వుండే పాన్ ఫ్రూట్ నుంచి తీస్తారు. అన్నిరకాల నేలలో పుష్కలంగా పెరిగే అవకాశం పామాయిల్ చెట్లకు ఉంది. నూనె ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర నూనెలతో పోలిస్తే ఈ నూనె ధర చాలా తక్కువగా ఉంటుంది.
ఎక్కువ క్యాలరీలు..
ఈ నూనెలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. మనకు అవసరమైన స్థాయికన్నా ఎక్కువ మోతాదులో క్యాలరీలు మన శరీరంలోకి చేరిపోతాయి. అందుకు తగ్గ శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయం వంటి ఇతరత్రా ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యా ట్ కంటెంట్..
వైద్యుల సలహాల మేరకు పామాయిల్ వినియోగం తగ్గించుకుంటే మంచిది మిగిలిన నూనెలతో పోల్చుకుంటే పామాయిల్ లో 34 శాతం ఫ్యా ట్ కంటెంట్ ఉంటుంది. అదే ఆలివ్ నూనెలో అందులో సగం మాత్రమే ఉంటుంది.
హోటల్లో, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా పామాయిల్ నే ఉపయోగిస్తున్నారు. చాక్లెట్లు తయారీలోనూ పామాయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పామాయిల్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
నష్టాలే ఎక్కువ..
పామాయిల్ ను వినియోగించడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అని పలు పరోశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. అంతేకాదు ఫిట్నెస్ కోసం ప్రయత్నించే వారు పామాయిల్ అస్సలు వాడకూడదని డైటీషన్స్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com