ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల ఎలాంటివారికి మరింత ప్రమాదం..? 

సాక్షి లైఫ్ : మూత్రం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మాత్రమే కాకుండా, మూత్ర నాళాల ద్వారా బ్యాక్టీరియాను తొలగించడం లో కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మూత్రాన్ని ఎక్కువ సమయంపాటు ఆపుకున్నప్పుడు, లోపల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు, మహిళలు, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.

ఇది కూడా చదవండి..రెటినాయిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

మూత్రాశయం పనితీరుపై తీవ్ర ప్రభావం.. 

మూత్రాశయం అనేది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయం పనితీరు దెబ్బతింటుంది. ఎక్కువరోజులపాటు యూరిన్ ను ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

మూత్రపిండాలపై ఒత్తిడి.. 

 ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి రక్తం నుంచి వెలువడే విషాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. మూత్రం మూత్రాశయంలో అధికంగా నిండినప్పుడు అది తిరిగి మూత్రపిండాల్లోకి చేరుతుంది. తద్వారా మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

ఇతర దుష్ప్రభావాలు.. 

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ అనే పరిస్థితి తలెత్తవచ్చు. ఇది ఒకరకమైన ఇన్ఫెక్షన్. దీనికి త్వరగా చికిత్స చేయకపోతే, మూత్రపిండాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండవచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కానప్పుడు, మూత్రాశయం నుంచి బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : holding-your-pee holding-pee pee holding-pee-for-long-time holding-pee-side-effects-on-body health-risks-of-holding-pee side-effects-of-holding-in-your-pee how-long-can-you-hold-your-pee is-holding-your-pee-bad need-to-pee pee-holding-while-party
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com