సరికొత్త ఆవిష్కరణ : చెమటతో షుగర్ పరీక్ష..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చెమటతో షుగర్ ను పరీక్షించే పరికరాన్ని రూపొందించారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన శాస్త్రవేత్త. ఆయన ఈ సరికొత్త పరికరాన్ని తయారు చేయడమేకాదు దీనిపై పేటెంట్‌ రైట్స్ ను కూడా పొందారు. జనరల్ గా బ్లడ్ తో షుగర్‌ టెస్టులు చేస్తుంటారు. తినక ముందు, తిన్న తర్వాత రెండురకాల పరీక్షలు చేస్తుంటారు.  

ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్(ఎఫ్బీఎస్), రాండం బ్లడ్‌ షుగర్‌ (ఆర్బీఎస్) అనే టెస్టులు రక్తం సేకరించి చేస్తుంటారు. ఓ తెలుగు శాస్త్రవేత్త మధుమేహ పరీక్ష చేయడానికి వినూత్నమైన పరికరాన్ని తయారు చేశారు. చెమటతో షుగర్ ను పరీక్షించే ఓ పరికరాన్ని కనుగొన్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు. ఆయన గ్లూకోజ్ ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్ డివైస్ ను రుపొంచించారు. ఈ పరికరానికి సంబంధించి పేటెంట్‌ను కూడా శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు పొందారు. 

ఈ పరికరం ద్వారా రక్తంతో పని లేకుండా చెమట ద్వారా పరీక్షించి ఒకే ఒక్క నిమిషంలో షుగర్ లెవల్స్ తెలుసుకోవచ్చు. ఆయన తయారుచేసిన ఈ  పరికరాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం భారత ప్రభుత్వం పేటెంట్ రైట్స్  ఇస్తూ ఇటీవల ఓ సర్టిఫికేట్ ను జారీ చేసింది.

చిరంజీవి శ్రీనివాసరావు బయో కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ కాన్పూర్లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.ఆయన ఈ డివైస్ ను రూపొందించడానికి నాలుగేళ్ల పాటు శ్రమించారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రోకెమికల్, సెన్సర్లను ఉపయోగించి ఈ పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని అన్ని రకాలుగా పరీక్షించి డిసెంబర్ 29వతేదీన శ్రీనివాసరావుకు పేటెంట్ రైట్స్ అందిస్తూ ఇండియన్ పేటెంట్ అధారిటీ సర్టిఫికేట్ జారీ చేసింది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.