Polluted Air : పీల్చే గాలి కలుషితమైతే.. మెదడుకూ ముప్పే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొత్తగా పరిచయమైన వారి పేర్లు అస్సలు గుర్తుండటం లేదా? ముఖ్యమైన వస్తువులు ఎక్కడ పెట్టామో మరిచిపోతున్నారా..? వయసు పైబడటం వల్లో లేదా రోజువారీ హడావిడి వల్లో ఇలా జరుగుతోందని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది తీవ్రమైన 'డిమెన్షియా' అంటే మతిమరుపు వ్యాధి.. ప్రాథమిక లక్షణం కావచ్చు. అయితే, ఈ జ్ఞాపకశక్తి క్షీణతకు కేవలం వయసు మాత్రమే కారణం కాదు.. మనం ప్రతిరోజూ పీల్చే కలుషిత గాలి కూడా ఒక ప్రధాన శత్రువుగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

వాతావరణంలోని అత్యంత సూక్ష్మమైన PM 2.5 కణాలు, అలాగే ఇళ్లలో ఏర్పడే వాయు కాలుష్యం వల్ల డిమెన్షియా వచ్చే ముప్పు భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

మెదడుపై కాలుష్య పంజా..!

డిమెన్షియా అనేది కేవలం జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా మనిషి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను పూర్తిగా మార్చేసే మానసిక రుగ్మత. గతంలో వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, గుండె, కళ్లకు మాత్రమే ప్రమాదమని భావించేవారు. కానీ, కాలుష్య కారకాలు నేరుగా మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు 65 ఏళ్ల లోపు వారిలో కూడా ఈ సమస్య లక్షణాలు పనిచేసే సమయంలోనే బయటపడుతున్నాయి.

దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), తన నూతన మార్గదర్శకాల్లో మొదటిసారిగా వాయు కాలుష్యాన్ని (PM 2.5) డిమెన్షియాకు ఒక ప్రధాన ప్రమాద కారకంగా చేర్చింది.

భారతీయ జనాభాకు పొంచి ఉన్న ముప్పు..  

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో భారతదేశంలోని పలు నగరాలు ముందుండటం మన దేశానికి పెద్ద హెచ్చరిక లాంటిదే. దీనికి తోడు భారత్‌లో డిమెన్షియా ముప్పును పెంచే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

అధిక రక్తపోటు (Hypertension)

మధుమేహం (Diabetes)

ఊబకాయం (Obesity)

పక్షవాతం, ధూమపానం..

ఈ కారకాలను సకాలంలో నియంత్రించకపోతే, రాబోయే రోజుల్లో దేశంలో మతిమరుపు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఊహించని స్థాయికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు.. 

ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ డిమెన్షియా భారం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా అల్ప, మధ్య ఆదాయ దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

ప్రపంచవ్యాప్తంగా..

2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.7 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతుండగా, ఏటా కోటి మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 7.8 కోట్లకు, 2050 నాటికి 13.2 కోట్లకు చేరవచ్చని అంచనా.

భారతదేశంలో..  

ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 10.4 కోట్ల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 7 శాతం మంది ఇప్పటికే ఏదో ఒక రకమైన మతిమరుపు సమస్య ఎదుర్కొంటున్నారు. అంటే దాదాపు 6 నుంచి 7 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదంలో ఉన్నట్లు లెక్క.

మనం నివసించే పరిసరాలలో, ఇళ్లలో వాయు కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించడం, ఇంట్లో గాలి సరిగ్గా ఆడేలా చూసుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవడం మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

  ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.