IIT Roorkee’s Key Research on Cow Urine Extract : చికున్‌గున్యాకు విరుగుడు దొరికినట్లేనా..? ‘గోమూత్ర సారం’పై ఐఐటీ రూర్కీ కీలక పరిశోధన..!
సాక్షి లైఫ్ : వర్షాకాలం వచ్చేసిందంటే చాలు.. దేశవ్యాప్తంగా దోమల విజృంభణ మొదలవుతుంది. డెంగ్యూ, మలేరియాలతో పాటు చికున్‌గున్యా బారిన పడి వేలాది మంది ఆసుపత్రుల పాలవు తుంటారు. కీళ్ల నొప్పులతో నరకం చూపించే చికున్‌గున్యాకు ఇప్పటివరకు మార్కెట్‌లో ఖచ్చితమైన యాంటీవైరల్ మందు లేదు. కేవలం లక్షణాలను బట్టి మాత్రమే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి, ఆధునిక విజ్ఞానాన్ని జోడిస్తూ ఐఐటీ రూర్కీ (IIT Roorkee) శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. గోమూత్ర సారం (Cow Urine Extract) ద్వారా చికున్‌గున్యా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ల్యాబ్ ప్రయోగాల్లో తేల్చారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
వైరల్ లోడ్ 99 శాతానికి పైగా హరితం..!
ఐఐటీ రూర్కీకి చెందిన బయోసైన్సెస్ అండ్ బయోఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శైలి తోమర్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 90శాతంపైగా నియంత్రణ.. ప్రయోగశాల (Lab) పరీక్షల్లో గోమూత్రంలో లభించే కొన్ని సహజ సిద్ధమైన సమ్మేళనాలు (Natural Compounds) చికున్‌గున్యా వైరస్ తీవ్రతను 90 శాతం కంటే ఎక్కువగా తగ్గించినట్లు గుర్తించారు. ప్రత్యేక ఫార్ములేషన్.. గోమూత్రం ఆధారంగా శాస్త్రవేత్తలు రూపొందించి న ఒక ప్రత్యేక ఫార్ములేషన్.. వైరల్ లోడ్‌ను ఏకంగా 99.85 శాతం మేర విజయవంతంగా తగ్గించిందని పరిశోధకులు స్పష్టం చేశారు.
అసలేమిటీ చికున్‌గున్యా..?
ఇది ఒక రకమైన వైరల్ జ్వరం. సంక్రమిత ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి శారీరక స్పర్శ ద్వారా లేదా లాలాజలం ద్వారా వ్యాపించదు.
ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..?
తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు.
భరించలేని కీళ్ల నొప్పులు..ఇవి జ్వరం తగ్గిన తర్వాత కూడా వారాలు లేదా నెలల తరబడి వేధిస్తాయి.
తీవ్రమైన నీరసం, శరీరంపై దద్దుర్లు రావడం.
ఈ పరిశోధన ఫలితాలు చికున్‌గున్యా నివారణకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రజలు కొన్ని విషయాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ప్రాథమిక ల్యాబ్ ప్రయోగాలు మాత్రమే.. ఈ ప్రయోగాలన్నీ కేవలం ప్రయోగశాల (In-vitro) పరిమితుల్లోనే జరిగాయి. ఇంకా మానవులపై క్లినికల్ ట్రయల్స్ (Human Trials) జరగాల్సి ఉంది.
ల్యాబ్‌లో శుద్ధి చేసిన సారంపైనే ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి, సాధారణ గోమూత్రాన్ని నేరుగా చికున్‌గున్యాకు మందుగా వాడటం సురక్షితం కాదు. సాంప్రదాయ ఆయుర్వేద మూలాలను ఆధునిక శాస్త్ర సాంకేతికతతో విశ్లేషిస్తే భవిష్యత్తులో చికున్‌గున్యాకు పూర్తి స్థాయి యాంటీవైరల్ మందును కనిపెట్టవచ్చని ఐఐటీ రూర్కీ పరిశోధన నిరూపిస్తోంది. తదుపరి దశ పరిశోధనలు విజయవంతమైతే, దోమల ద్వారా వచ్చే ఈ మహమ్మారికి తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ విరుగుడు లభించినట్లే..
ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
