Junk Food Addiction : యువతలో పెరిగిపోతున్న జంక్ ఫుడ్ పిచ్చి.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అత్యధికంగా ఉండే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు, అంటే క్యాండీ, ఐస్ క్రీమ్, ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, డబ్బాల్లోని ఆహారం, శీతల పానీయాలు, చాక్లెట్, ప్యాక్ చేసిన సూప్, చికెన్ నగ్గెట్స్, హాట్ డాగ్‌లు మొదలైనవి మద్యం అంత ప్రమాదకర మైనవని తాజా అధ్యయనాల ఆధారంగా పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల కంటే యువతే ఎక్కువగా జంక్ ఫుడ్ లేదా అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలకు బానిసలవుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం, ఎందుకంటే ఆరోగ్య దృష్ట్యా హానికరమైన ఈ ఆహార పదార్థాలపై పెరుగుతున్న మమకారం, మద్యం, ధూమపానం లాగానే పెరుగుతోంది.

 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

ఈ పరిశోధన ఫలితాలు 'ది బ్రిటిష్ మెడికల్ జర్నల్'లో ప్రచురించారు. అమెరికా, బ్రెజిల్ అండ్  స్పెయిన్‌కు చెందిన పరిశోధకుల ప్రకారం, 14 శాతం మంది పెద్దలలో 12 శాతం మంది పిల్లలలో ఉన్న జంక్ ఫుడ్ వ్యసనం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. అందుకే నేటి యువత గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.

 
పరిశోధకుల ప్రకారం, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అత్యధికంగా ఉండే ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో క్యాండీ, ఐస్ క్రీమ్, ఫ్రైస్, చిప్స్, బర్గర్లు, క్యాన్డ్ ఫుడ్, శీతల పానీయాలు, చాక్లెట్, ప్యాక్ చేసిన సూప్, చికెన్ నగ్గెట్స్, హాట్ డాగ్స్ వంటివి ఉన్నాయి.

ఇలాంటి ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఇవి అనేక ప్రక్రియలతో తయారవుతాయి. ఈ అధ్యయనం 36 దేశాలలో ప్రచురించిన 281 పరిశోధనల విశ్లేషణపై ఆధారపడి ఉంది.

లెక్కలేనన్ని వ్యాధులకు మూలం..

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. యూకే, యూఎస్‌లలో సగటు ఆహారంలో సగానికి పైగా ఇవే ఉన్నప్పటికీ, భారతదేశం వంటి దేశాలలో కూడా వీటి వినియోగం వేగంగా పెరుగుతోంది.

భారతీయ పిల్లలకు పెద్ద ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ అండ్ లాన్సెట్ కమిషన్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, కాలుష్యం,వాతావరణ మార్పులతో పాటు, జంక్ ఫుడ్ కూడా భారతీయ పిల్లల ప్రాణాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. అధికంగా వేయించిన ఆహారాన్ని తీసుకునే వారికి మధుమేహం,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, అధిక ఉప్పు వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 30 లక్షల మందికి పైగా మరణిస్తు న్నారు. అంతేకాకుండా, ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.