Intermittent Fasting : అడపాదడపా ఉపవాసంతో గుండెకు ముప్పు తప్పదా..? తాజా అధ్యయనం హెచ్చరిక..
సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్ సాధించడానికి ఇటీవలి కాలంలో 'అడపాదడపా ఉపవాసం' (intermittent fasting) ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రాచుర్యం పొందింది. బరువు నియంత్రణలోకి రావడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వంటి ప్రయోజనాలు ప్రారంభంలో ఆకర్షించినప్పటికీ, దీనిపై వచ్చిన ఒక తాజా పరిశోధన ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక నిర్దిష్ట సమయం ప్రకారం తినే ఈ అలవాటు, దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి చేటు చేయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
దాదాపు 20 వేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన ఒక సుదీర్ఘ అధ్యయనంలో నెత్తిన పిడుగు లాంటి నిజం వెల్లడైంది. రోజులో కేవలం 8 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలోనే ఆహారం తీసుకుంటూ, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండే వారిలో గుండె జబ్బుల కారణంగా మరణించే ప్రమాదం దాదాపు 91 శాతం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. దీర్ఘకాలం పాటు ఆహారానికి దూరంగా ఉండటం గుండె పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ డేటా స్పష్టం చేస్తోంది.
గుండెపై ఒత్తిడి పెంచే కారణాలు ఇవే..
ఎక్కువ సమయం పాటు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులే గుండెకు శత్రువులుగా మారుతున్నాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హార్మోన్ల హెచ్చుతగ్గులు..
ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar Levels) వేగంగా పెరగడం లేదా పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ వంటి హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది నేరుగా గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది.
గుండె కొట్టుకునే వేగంలో తేడాలు..
ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల గుండె కొట్టుకునే వేగంలో తేడాలు వచ్చి, 'అరిథ్మియా' (Arrhythmia - గుండె స్పందనల్లో క్రమరాహిత్యం) వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
పోషకాల లోపం..
దీర్ఘకాలం ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం (Dehydration) తగ్గుతుంది. దీని పర్యవసానంగా గుండె సక్రమంగా పనిచేయడానికి అత్యంత కీలకమైన పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల (Electrolytes) సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పోషకాల లోపం గుండె కండరాలను బలహీనపరుస్తుంది.
వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి..!
ఇప్పటికే మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (B.P) లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ తరహా ఉపవాస పద్ధతులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఉపవాస సమయం ముగిసిన వెంటనే (eating window) ఒకేసారి భారీగా ఆహారాన్ని తింటుంటారు. ఇలా ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో క్యాలరీలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు గుండెపై కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల సలహా ఏంటంటే..?
బరువు తగ్గడం అనేది ఆరోగ్యంగా ఉండటం కోసం మాత్రమే కావాలి కానీ, ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కాదు. అడపాదడపా ఉపవాసం (Intermittent Fasting) వంటి కఠినమైన డైట్ పద్ధతులను అనుసరించే ముందు, ముఖ్యంగా ముందస్తు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం. ఎవరి శరీర తత్వం వారికి వేరుగా ఉంటుంది కాబట్టి, ఇతరులను చూసి గుడ్డిగా డైట్లను ఫాలో అవ్వకుండా, వైద్యుల పర్యవేక్షణలోనే నిర్ణయాలు తీసుకోవాలని ఈ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
