లేటెస్ట్ స్టడీ : ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి..
సాక్షి లైఫ్ : కేవలం చిన్న మార్పులు, కొద్ది పాటి వ్యాయామంతో చాలారకాల అనారోగ్యాల బారినుంచి కాపాడుకోవచ్చిన పరిశోధకులు తేల్చారు. సమతుల ఆహారంతోపాటు, నడక లాంటి స్వల్ప వ్యాయామం జీవన శైలి మార్పులతో అకాల మరణాలనుంచి తప్పించు కోవచ్చని కూడా అధ్యయనాలు తేల్చి చెప్పాయి. 2023లో జరిగిన కొన్ని సైంటిఫిక్ పరిశోధనలో ఏమేం అంశాలు వెల్లడయ్యాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కీలక పురోగతి..
మెడిసిన్, బయోలజీ రంగంలో 2023సంవత్సరం కీలక పురోగతిని సాధించింది. పలు పరిశోధనల్లో ఇప్పటికే మనకు తెలిసిన అంశాలతోపాటు, మరికొన్ని ముఖ్యమైన ఫలితాలు వెలుగు చూశాయి. మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా చాలా చిన్న, సింపుల్ జీవనశైలి మార్పులను పరిశోధకులు గుర్తించారు. మనం తాగే కాఫీకి మరి కాస్త పాలు జోడిస్తే.. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ద్విగుణీకృతమవుతాయి. వేళాపాళా లేకుండా కాకుండా, క్యాలరీలతో కూడిన భోజనాన్ని వేళకు తీసుకోవడం ఉత్తమమని కూడా ఒక స్టడీ తేల్చింది. దీనివల్ల కార్డాయో వాస్క్యులరీ వ్యవస్థపై సానుకూల ప్రభావం, మెదడు చురుగ్గా ఉంటుంది.
మొదటి భోజనం ఆలస్యమైతే..
ప్రతి గంటకు రోజులో మొదటి భోజనం ఆలస్యమైతే, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6శాతంపెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ స్టడీలో భాగంగా 103,000 మందిపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ప్రకారం..ఉదయం 7 గంటలతో పోలిస్తే ఉదయం 10 గంటల తరువాత అల్పాహారం తీసుకునే వ్యక్తికి కొన్ని రకాల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం 18 శాతం ఎక్కువట. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి పక్షవాతం వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28శాతం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి 20 నిమిషాలకు కనీసం15 స్క్వాట్..
రాత్రి 8 గంటలలోపు భోజనం ముగించిన వారికి కూడా ఇది 28శాతం అని తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుమొద్దుబారుతుందనేది మరో స్టడీలో వెల్లడైంది. మధ్య మధ్యలో లేచి నడిస్తే బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్క్వాట్ అంటే గోడకుర్చీ వేసినట్లు గా కూర్చొని బరువులు ఎత్తడం. ప్రతి 20 నిమిషాలకు కనీసం15 స్క్వాట్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
