ఇలా చేస్తే మానసిక సమస్యలు తలెత్తవు..
సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో వృద్ధులు, పిల్లలు, యువత, మహిళలు అనే తేడాల్లేకుండా అందరూ మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి కారణంగా ఒకరితో మరొకరికి సంబంధాలు సరిగా లేకుండా బతకడమేనని మానసిక వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
సమయం కేటాయించాలి..
కుటుంబం, స్నేహితులు, అభిరుచులకు సమయం కేటాయించడం ఔషధం లాంటిదేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి జీవనం విధానంలో ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా బతకడం వల్ల ఒకరికొకరికి బంధాలు, బంధుత్వాలు తెగిపోయాయని, ఈ కారణంగానే అందరికీ మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని పలుఅధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..
ప్రస్తుతం అన్ని వయసుల వారు మానసిక వ్యాధులతో బాధపడుతు న్నారని మానసిక వైద్యులు నొక్కి చెబుతున్నారు. పెరుగుతున్న మానసిక అనారోగ్య సమస్యల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియక జనాలు సతమతమవుతున్నారు.
మీ స్నేహితులు, మీ అభిరుచులు, ప్రియమైనవారి కోసం సమయాన్ని వెచ్చించడం అనేది మానసిక సంబంధిత సమస్యలను నివారించే అతిపెద్ద ఔషధం అని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.
మరోపక్క దేశంలో మానసిక సమస్యలు పెరగడంతో ఆయుష్మాన్ భారత్ పథకంలో మానసిక వ్యాధులను చేర్చాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) కేంద్రం, రాష్ట్రాలకు సలహా ఇచ్చింది.
మానసిక ఆరోగ్యంపై..
జాతీయ మానవ హక్కుల కమిషన్ మానసిక ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిఫార్సుచేసింది. మానసిక రోగుల చికిత్సకు సరైన ఏర్పాట్లను అందించాలని తెలిపింది. మెంటల్ హెల్త్ అథారిటీ అండ్ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డును ఏర్పాటు చేయడానికి, మానసిక ఆరోగ్య చట్టం కింద నియమాలు, నిబంధనలను సిద్ధం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషన్ అన్ని రాష్ట్రాలను కోరింది.
ట్రీట్మెంట్..
జాతీయ మానవ హక్కుల కమిషన్ మానసిక ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు మానసిక రుగ్మతల చికిత్సకు అవకాశం కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకంలో మానసిక వ్యాధులను చేర్చడం అవసరమని కమిషన్ సెక్రటరీ జనరల్ భరత్ లాల్ జారీ చేసిన సలహాలో పేర్కొన్నారు. మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్, 2017 ద్వారా నిర్దేశించిన ప్రకారం నియమ, నిబంధనలను రూపొందించడానికి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ కోరింది.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
