New Research : బట్టతల ఉన్నవారికి శుభవార్త.. 6 నెలల్లోనే 80 శాతం జుట్టు తిరిగి వచ్చే ఛాన్స్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జుట్టు రాలడం, బట్టతల సమస్యలు నేటి యువతను తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా పాతికేళ్ల వయసులోనే చాలా మంది పురుషులు జుట్టు పలచబడే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, 'అలోపేసియా ఏరియాటా' (Alopecia Areata) అనే తీవ్రమైన జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారికి వైద్య నిపుణులు ఒక శుభవార్త అందించారు. ఆరు నెలల్లోనే కోల్పోయిన జుట్టును తిరిగి రప్పించే ఒక అద్భుతమైన మందును పరిశోధకులు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

సాధారణ బట్టతల కాదు.. ఇదో ఆటో ఇమ్యూన్ సమస్య..

సాధారణంగా వయసు, జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి లేదా పోషకాహార లోపంతో వచ్చే బట్టతలకి, అలోపేసియాకు చాలా తేడా ఉంది. అలోపేసియా ఏరియాటా అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున హెయిర్ ఫాలికిల్స్ అంటే జుట్టు కుదుళ్లుపై దాడి చేస్తుంది. దీనివల్ల తల, గడ్డం లేదా శరీరంలోని ఇతర భాగాలపై నాణేల పరిమాణంలో గుండ్రంగా జుట్టు రాలిపోయి మచ్చల్లా ఏర్పడతాయి. దీన్ని పట్టించుకోకపోతే కొన్నిసార్లు తల మీది జుట్టు మొత్తం రాలిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఆర్థరైటిస్ మందుతో అద్భుత ఫలితం..

అమెరికన్ పరిశోధకుల బృందం చేసిన తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కీళ్లవాతం (ఆర్థరైటిస్), పేగు సంబంధిత వ్యాధుల చికిత్సలో వాడే 'ఉపాడాసిటినిబ్' (Upadacitinib) అనే మందు.. అలోపేసియా వల్ల జుట్టు కోల్పోయిన వారిలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. జేఏఎంఏ (JAMA) డెర్మటాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ఈ మందును వాడటం ద్వారా తీవ్రంగా జుట్టు రాలిపోయిన వారు కూడా తిరిగి జుట్టును పొందవచ్చు.

అధ్యయనంలో తేలిన కీలక విషయాలు.. 

దాదాపు 1,400 మంది తీవ్రమైన అలోపేసియా పేషెంట్ల (12 నుంచి 64 ఏళ్లు) మీద ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో కొందరు ఎనిమిదేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. రోగులకు రోజూ 15 మి.గ్రా, 30 మి.గ్రా చొప్పున 'ఉపాడాసిటినిబ్' మాత్రలను 24 వారాల అంటే ఆరు నెలలు పాటు ఇచ్చారు.

ఆరు నెలల తర్వాత 15 మి.గ్రా వాడిన వారిలో 45 శాతం మందికి, 30 మి.గ్రా వాడిన వారిలో 55 శాతం మందికి ఏకంగా 80 శాతం జుట్టు తిరిగి రావడం విశేషం. మందు వాడటం మొదలుపెట్టిన రెండు నెలల్లోనే చాలా మంది జుట్టులో స్పష్టమైన ఎదుగుదల కనిపించింది.

ఎలా పనిచేస్తుంది..? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..?

ఉపాడాసిటినిబ్ అనేది 'జేఏకే ఇన్హిబిటర్' (JAK Inhibitor) మందుల కోవకు చెందుతుంది. జుట్టు కుదుళ్లపై రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని అడ్డుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే ఈ మందు వాడిన కొందరిలో మొటిమలు రావడం, జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. కానీ ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ లేవని పరిశోధకులు స్పష్టం చేశారు.

 సొంత వైద్యం వద్దు..!

ఈ మందు సాధారణ బట్టతలకు (Pattern Baldness) పరిష్కారం కాదు.. కేవలం 'అలోపేసియా ఏరియాటా' రోగుల కోసమే. కాబట్టి, జుట్టు రాలిపోతోందని మెడికల్ షాపుకు వెళ్లి సొంతంగా ఈ మందును కొనుగోలు చేసి వాడకూడదు. ఈ మందును కేవలం డెర్మటాలజిస్ట్ ల పర్యవేక్షణలో, తగిన వైద్య పరీక్షల తర్వాత మాత్రమే వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలోపేసియా అనేది థైరాయిడ్, బొల్లి లేదా మధుమేహం (టైప్-1) వంటి ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులతో కూడా ముడిపడి ఉండే అవకాశం ఉన్నందున వైద్యుల సలహా తప్పనిసరి.

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.