Blind Woman Regains Sight : ప్రపంచంలోనే తొలిసారిగా అంధురాలికి చూపు.. ఇటలీవైద్యులు నిర్వహించిన ప్రయోగంతో కంటిచూపు

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అసాధ్యం అనుకున్న దాన్ని వైద్యులు సుసాధ్యం చేశారు. ఐదేళ్లుగా అంధకారంలో మగ్గుతున్న 67 ఏళ్ల వృద్ధురాలికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స ద్వారా కంటిచూపును తిరిగి ప్రసాదించారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ అద్భుత ప్రయోగం ఇటలీలో చోటుచేసుకుంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

మెదడుకు సంకేతాలు అందకపోవడంతో.. 

ఎలెనా (67) అనే ఇటలీ మహిళ ఐదేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంలో కంటిచూపును పూర్తిగా కోల్పోయారు. ఆమె ఎడమ కంటిలోని దృశ్య నాడి (optic nerve) తీవ్రంగా దెబ్బతింది. కంటిలోని ఇతర భాగాలు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, మెదడుకు సంకేతాలు అందకపోవడం వల్ల ఆ కన్ను పూర్తిగా పనిచేయడం మానేసింది.

కుడి కంటికి వయసు పైబడటం వల్ల వచ్చే మాక్యులర్ డిజెనరేషన్ సమస్య ఉండటంతో పాటు, ప్రమాదంలో రెటీనా, కార్నియా దెబ్బతినడంతో రెండు కళ్లూ పనికిరాకుండా పోయాయి.

వైద్యుల వినూత్న ప్రయోగం..

సాధారణ కార్నియా మార్పిడి (Corneal Transplant) ఇక్కడ సాధ్యపడలేదు. దీంతో ఇటలీలోని ట్యూరిన్ లో గల మోలినెట్ ఆసుపత్రి వైద్యులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ మిచెల్ రిబాల్డి నేతృత్వంలోని బృందం ఎలెనా ఎడమ కంటిలోని ఆరోగ్యకరమైన కణజాలాలను తీసి కుడి కంటికి అమర్చారు.

శస్త్రచికిత్సలో ఏం చేశారంటే..?

ఈ ఆపరేషన్ లో కేవలం కార్నియాను మాత్రమే కాకుండా కంటి తెల్లటి పొర (sclera), కంటిని కప్పే పొరల(conjunctiva)ను ఎడమ కంటి నుంచి తీసి కుడి కంటికి వేశారు. అన్నిటికంటే ముఖ్యంగా కంటి చూపులో అత్యంత కీలకమైన మాక్యులా అంటే రెటీనా మధ్య భాగం ను కూడా విజయవంతంగా మార్పిడి చేశారు. ఒక కంటికి సంబంధించిన మాక్యులాను తీసి మరో కంటికి అమర్చడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

రెండు పనిచేయని కళ్లలోని మంచి భాగాలను కలిపి, ఒక పనిచేసే కన్నును సృష్టించడంలో వైద్యులు విజయం సాధించారు. శస్త్రచికిత్స అనంతరం కళ్లు తెరిచిన ఎలెనా, తన కుమారుడి ముఖాన్ని స్పష్టంగా చూడటంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ కుడి కంటి చూపు మరింతగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.