Carbon Dioxide : రక్తంలో పెరుగుతున్న 'కార్బన్ డై ఆక్సైడ్'.. నిపుణుల తీవ్ర హెచ్చరిక..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంతుందో పట్టించుకుంటాం కానీ, వదిలే కార్బన్ డై ఆక్సైడ్ (CO2) గురించి పెద్దగా ఆలోచించం. ఆక్సిజన్ తగ్గితే ఎంత ప్రమాదమో, రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరిగినా అంతే ప్రమాదమని, ఇది దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

 

పెరిగితే ఏమవుతుంది..?

సాధారణంగా మన ఊపిరితిత్తులు శరీరంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపుతాయి. కానీ ఈ ప్రక్రియలో ఆటంకం ఏర్పడితే రక్తంలో ఈ గ్యాస్ పేరుకుపోతుంది. దీనివల్ల తలనొప్పి, గందరగోళం, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే మెదడుతో పాటు ఇతర ముఖ్య అవయవాల పనితీరు మందగిస్తుంది.

తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం నేరుగా మానవ దేహంలోని రసాయన ప్రక్రియలపై ప్రభావం చూపుతోందని ఒక తాజా నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన 'ది కిడ్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్', కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు అమెరికాలోని సుమారు 7,000 మంది ఆరోగ్య డేటాను (1999 నుంచి 2020 వరకు) విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించారు.

శరీరంలో వస్తున్న కీలక మార్పులు..

బైకార్బోనేట్ పెరుగుదల.. ఈ రెండు దశాబ్దాల కాలంలో ప్రజల రక్తంలో 'సీరం బైకార్బోనేట్' సగటు స్థాయిలు సుమారు 7 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో దేహానికి అత్యవసర మైన కాల్షియం, ఫాస్పరస్ స్థాయిలు పడిపోయాయి. 2000 సంవత్స రంలో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు 369 ppm (parts per million) గా ఉండగా, ఇప్పుడది 420 ppm లను దాటేసింది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులే మనుషుల రక్తంలో మార్పులకు కారణమవుతున్నాయి.

ముప్పు తప్పదా..?

రక్తంలో 'బైకార్బోనేట్' అనేది శరీరంలో ఆమ్ల, క్షార (acid base balance) సమతుల్యతను కాపాడే ముఖ్యమైన రసాయనం. వాతావరణంలో CO2 పెరుగుదలకు అనుగుణంగా రక్తంలో బైకార్బోనేట్ ఇలాగే దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే.. శ్వాసవ్యవస్థ పనితీరు, రక్తంలో pH బ్యాలెన్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. ఎముకలు, కండరాల సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.