Deep Vein Thrombosis : డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది ప్రాణాంతకమైందా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాళ్లు, చీలమండల్లో నొప్పులు, వాపులను సాధారణ అలసట లేదా చిన్న గాయంగా భావించి నిర్లక్ష్యం చేయడం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారొచ్చు. ఈ చిన్న లక్షణాలు డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) వంటి తీవ్రమైన సమస్యకు ముందస్తు సంకేతాలు కావచ్చని బ్రిటన్‌కు చెందిన ఓ యువతి ఘటన స్పష్టం చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల సారా బాస్రా కాలి వేళ్లు ఎర్రబడి, వేడిగా అనిపించడంతో పాటు చీలమండ వాపు, తీవ్రమైన నొప్పితో బాధపడింది.

వైద్యులు మొదట దాన్ని నెయిల్ పాలిష్ అలర్జీ అని, ఆ తర్వాత మడమ నొప్పికి సంబంధించిన 'ప్లాంటర్ ఫాసియైటిస్' అని పొరబడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఓ కార్యక్రమంలో ఆమెకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడంతో కుప్పకూలిపో యింది. హార్ట్ ఎటాక్ అనుకుని ఆసుపత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

పరీక్షల్లో ఆమె కాలి లోపలి నరాల్లో రక్తం గడ్డకట్టిందని (DVT), ఆ గడ్డ మెల్లగా కదిలి ఊపిరితిత్తులకు చేరి రక్తప్రసరణను అడ్డుకుందని అది పల్మనరీ ఎంబోలిజం(pulmonary embolism) గా తేలింది. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది.

అసలు కారణం - యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (APS)..

సారా రక్త పరీక్షల్లో ఆమెకు 'యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్' (Hughes Syndrome) ఉన్నట్లు కొన్ని నెలల తర్వాత నిర్ధారణ అయింది. ఇది రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ఆటోఇమ్యూన్ సమస్య. దీని బారిన పడిన వారిలో రక్తం జిగటగా మారి, అవసరం లేకపోయినా సులభంగా గడ్డకడుతుంది. 50 ఏళ్లలోపు వయసువారిలో వచ్చే స్ట్రోక్, డీవీటీ, గుండెపోటు కేసుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సమస్యే కారణమవుతోందని అంచనా. గర్భిణుల్లో తరచూ గర్భస్రావాలకు కూడా ఇది దారితీస్తుంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటే మన శరీరంలోని లోపలి  సిరల్లో కాళ్లు, తొడలలో రక్తం గడ్డకట్టడంవల్ల తలెత్తే తీవ్రమైన పరిస్థితి. 

లక్షణాలు-నిపుణుల హెచ్చరికలు..

కాలి నరాల్లో రక్తం గడ్డకడితే వాపు, నొప్పి, ముట్టుకుంటే చురుక్కుమనడం లేదా చర్మం ఎర్రబడటం వంటివి కనిపిస్తాయి. సుమారు 80 శాతం DVT కేసుల్లో బయటకు పెద్దగా వాపు కనిపించకపోవచ్చని, అందుకే ప్రారంభ దశలో దీన్ని గుర్తించడం కష్టమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపు గడ్డలు కాళ్ల నుంచి ఊపిరితిత్తులకు చేరితే అది తక్షణ మెడికల్ ఎమర్జెన్సీకి దారితీస్తుంది.

నివారణ, చికిత్స..

జన్యుపరమైన కారణాలతో పాటు పోషకాల్లేని ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం వల్ల ఈ సమస్య ముప్పు పెరుగుతుంది. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కాళ్లు, వేళ్లలో నొప్పి, వాపు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే రక్తం పలచబడే (blood-thinning medications) మందులు, ఇంజెక్షన్ల ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచవచ్చు.

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.