Relief for Diabetes Patients: మధుమేహ బాధితులకు ఊరట..రోజూ కాకుండా.. వారానికి ఒక్కసారే ఇన్సులిన్ ఇంజెక్షన్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం (diabetes)తో బాధపడుతూ రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే రోగులకు వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు పెద్ద ఉపశమనం కలిగిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ సూది గుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ విధానం అందుబాటులోకి వస్తోంది.


వారానికోసారి డోస్..

 రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో సమానంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో వీక్లీ ఇన్సులిన్ విజయవంతం.
'ఎఫ్సిటోరా ఆల్ఫా' (Efsitora Alfa) వంటి సరికొత్త ఫార్ములేషన్లు రోజువారీ ఇంజెక్షన్ల భారాన్ని తగ్గిస్తాయి.

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి.. Are You Healthy : ఆరోగ్యం సరైన ట్రాక్‌లోనే ఉందో లేదో ఈ లక్షణాల ద్వారా చెక్ చేసుకోండి.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..  

 

వృద్ధులకు వరం..

 స్వయంగా ఇంజెక్షన్ తీసుకోలేని వృద్ధులు, చేతుల వణుకు, చూపు మందగించిన రోగులకు అత్యంత ప్రయోజనకరం.

రోజువారీ సూది పోటుకు చెక్..!

ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతోంది. భారత్‌లో కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా, సుమారు 60 లక్షల మందికి పైగా రోగులు రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆహార నియమాలు, మందులతో షుగర్ అదుపులోకి రాని వారికి ఇన్సులిన్ తప్పనిసరి. అయితే, రోజుకు ఒకటి లేదా రెండుసార్లు సూదులు వేసుకోవడం రోగులకు శారీరకంగానే కాక మానసికంగానూ భారంగా మారుతోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు దీర్ఘకాలం పనిచేసే 'వీక్లీ ఇన్సులిన్'ను అభివృద్ధి చేశారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లతో సమానమైన ఫలితాలను ఇచ్చినట్లు రుజువైంది.

ఇది శరీరంలో ఎలా పనిచేస్తుంది..?

ఇన్సులిన్ అనేది మనం తినే ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్‌ను శరీరానికి అవసరమైన శక్తిగా మార్చే హార్మోన్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినా లేదా సమర్థంగా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఈ కొత్త తరం వీక్లీ ఇన్సులిన్ శరీరంలో నెమ్మదిగా విడుదలవుతూ, వారం రోజుల పాటు సమాన స్థాయిలో రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఇప్పటికే బ్రిటన్‌లోని ఆరోగ్య నియంత్రణ సంస్థలు (NICE వంటివి) దీని సమర్థతను, ఆచరణీయతను సానుకూలంగా అంచనా వేశాయి.

ఇన్సులిన్ తీసుకునే విధానం..

ఇన్సులిన్ తీసుకునే విధానంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా స్వతహాగా నిర్ణయాలు తీసుకోకూడదు. రోగి ఆరోగ్య పరిస్థితి, షుగర్ హెచ్చుతగ్గులు (HbA1c) ఆధారంగా సంబంధిత డయాబెటాలజిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా మేరకే కొత్త చికిత్సలను ప్రారంభించాలి.

ఈ వారానికోసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ పలు వర్గాల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా నివసించే వారు రోజూ ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా, వారానికి ఒక్కసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే, చేతుల వణుకు, మతిమరుపు వంటి సమస్యల వల్ల రోజూ సమయానికి డోస్ తీసుకోలేని పార్కిన్సన్స్, డిమెన్షియా బాధితులకు ఇది ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా, బిజీగా ఉండే ఉద్యోగులు, తరచూ ప్రయాణాలు చేసే వారికి ప్రతిరోజూ తమ వెంట ఇన్సులిన్ కిట్లను తీసుకెళ్లాల్సిన ఇబ్బంది కూడా దీనివల్ల గణనీయంగా తగ్గుతుంది.

 

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.