New Study : ‘ఫైబ్రోమయాల్జియా’ వెనుక అసలు నిజం బయటపెట్టిన తాజా అధ్యయనం..!
సాక్షి లైఫ్ : శరీరంలోని వివిధ భాగాలలో నిరంతరం వేధించే నొప్పులు, ఎప్పుడూ అలసటగా అనిపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చిన్న విషయాలపై కూడా ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా? వైద్య పరిభాషలో దీనిని ‘ఫైబ్రోమయాల్జియా’ (Fibromyalgia) అంటారు. ఈ దీర్ఘకాలిక రుగ్మతతో బాధపడేవారికి రోజువారీ జీవితం ఎంతో దుర్భరంగా మారుతుంది. అయితే ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న కారణాలపై శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక భారీ జన్యుపరమైన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
అధ్యయనంలో వెల్లడైన వివరాలు..
ప్రఖ్యాత 'నేచర్ మెడిసిన్' పత్రికలో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. పరిశోధకులు సుమారు 25.6 లక్షల మందికి పైగా వ్యక్తుల జన్యుపరమైన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో సుమారు 55 వేల మంది ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నవారే కావడం గమనార్హం. ఈ వ్యాధి ముప్పునకు ప్రత్యక్షంగా కారణమయ్యే 26 నిర్దిష్ట జన్యు ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాడీ వ్యవస్థే ప్రధాన కారణం..
గుర్తించిన ఆ జన్యువులలో దాదాపు సగం వరకు నాడీ వ్యవస్థ (Nervous System) అభివృద్ధికి, అలాగే శరీరంలో నొప్పిని అనుభవించే ప్రక్రియకు సంబంధించినవి కావడం విశేషం. ఫైబ్రోమయాల్జియా విషయంలో మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమని ఈ తాజా పరిశోధన ఫలితాలు బలంగా నిరూపిస్తున్నాయి. అంటే, శరీరంలో ఎక్కడ నొప్పులు వచ్చినా.. ఆ నొప్పిని తలపించే ప్రక్రియ అంతా నేరుగా మన మెదడుతోనే ముడిపడి ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ దిశగా వస్తున్న కొత్త ఆవిష్కరణలు భవిష్యత్తులో ఈ దీర్ఘకాలిక నొప్పికి సరైన చికిత్సనందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
