Diabetes : రోజూ పండ్లు తింటే డయాబెటిస్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. జామ, కివి లాంటి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి. అయితే, సాధారణంగా పండ్లు తియ్యగా ఉంటాయి కదా.. వాటిని రోజూ తింటే డయాబెటిస్ (diabetes) వస్తుందా..? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంపై ఆహార నిపుణులు (nutritionists) ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లలో ఉండేది సహజ తీపే..

పండ్లలో ఫ్రక్టోజ్ అనే సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. పండు అనగానే కేవలం చక్కెర మాత్రమే కాదు, అందులో ఫైబర్ (fiber), నీటి శాతం, ఎన్నో విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఫైబర్ కారణంగా జీర్ణప్రక్రియ నెమ్మదించి, పండ్లలోని గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. కాబట్టి కేవలం పండ్లు తిన్నంత మాత్రాన షుగర్ పెరుగుతుందనే భయం అవసరం లేదు. కృత్రిమంగా కలిపే చక్కెర (Added Sugar), సహజ చక్కెర (Natural Sugar) రెండు వేర్వేరు. సహజ చక్కెరల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.

జ్యూస్ రూపంలో వద్దు..

పండ్లు తింటే షుగర్ పెరగదు కానీ, వాటిని జ్యూస్(juice)రూపంలో తీసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. జ్యూస్ చేసినప్పుడు పండ్లలోని ముఖ్యమైన పీచుపదార్థం (fiber) పూర్తిగా తొలగిపోతుంది. అందుకే పండ్ల రసాలకు బదులుగా నేరుగా పండ్లనే తొక్కతో తినగలిగేవి తినాలని 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' కూడా సూచిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ ఫ్రూట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటిలో అదనపు చక్కెరలు కలుపుతారు కాబట్టి మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..  

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

 

డ్రై ఫ్రూట్స్ తో కాస్త జాగ్రత్త..

తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కిస్మిస్, ఖర్జూరం, ఎండు అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. పండ్లను ఎండబెట్టినప్పుడు అందులో తీపి శాతం, క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

షుగర్ వస్తుందనే భయంతో పండ్లు తినడం మానేయడం సరైన పరిష్కారం కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండే తాజా పండ్లను ఎంచు కోవాలి. జ్యూస్‌లు, స్వీట్ మిల్క్ షేక్స్‌కు బదులుగా పండ్లను ముక్కలుగా కోసుకుని తినడమే ఉత్తమం. డయాబెటిస్ అనేది కేవలం ఒక పండు తినడం వల్ల రాదు. ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వయసు, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్య కారణాలు.. ఇవన్నీ షుగర్ వ్యాధికి కారణమవుతాయి.

అరటిపండు, మామిడి, ద్రాక్ష లాంటి పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ తినే మోతాదు (Portion control) పై దృష్టి పెట్టాలి.
కాబట్టి, సరైన వ్యాయామంతో పాటు బరువును అదుపులో ఉంచుకుంటూ, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పును తప్పించుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.