ఆక్సిటోసిన్ పాలు అంటే..?
సాక్షి లైఫ్ : గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు దూడ పాలు తాగుతుంది. కానీ దూడలు పాలు తాగేస్తున్నాయనే కారణంతో వాటిని వెంటనే దూరం చేస్తున్నారు. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మడానికి దూడకు బదులు నిషేధిత ఆక్సీటోసిన్ ఇంజక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు ఇచ్చి మొత్తం పాలు పిండుతున్నారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది కానీ పాలలో ఆక్సిటోసిన్ కలిసిపోతుంది.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లో అనేక రకాల హార్మోన్లుంటాయి. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాల పాటు పాలు తాగాల్సి ఉంటుంది. కానీ అతి తక్కువ ధరకు దొరికే ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్ ఇస్తే చాలు కొన్ని సెకన్లల్లో గేదెసేపడంతోపాటు పొదుగు నుంచి పాలు వస్తాయి. ప్రమాదకర హర్మోన్లు ఉండే ఈ ఇంజక్షన్లను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం అయినా కొంతమంది ఈ పని మానుకోవడంలేదు.
ఇది కూడా చదవండి.. భారతీయ ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్ఐఎన్
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
