49th New Blood Group Jama : 49వ కొత్త బ్లడ్ గ్రూప్.. పేరు 'జామా'..! ఇజ్రాయెల్ మహిళ రక్తంలో గుర్తించిన శాస్త్రవేత్తలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనకు సాధారణంగా ఏ, బీ, ఏబీ, ఓ (A, B, AB, O) బ్లడ్ గ్రూపులు తెలుసు. రక్తం ఎక్కించాల్సి వస్తే వీటినే చూస్తారు. కానీ బ్రిటన్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక సరికొత్త బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు. దీని పేరు 'జామా' (JAMA). ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ దీనికి మనుషుల్లో '49వ బ్లడ్ గ్రూప్ సిస్టమ్'గా అధికారిక గుర్తింపునిచ్చింది.

అసలు ఎలా బయటపడింది..?

ఇజ్రాయెల్‌కు చెందిన ఒక మహిళ, ఆమె సోదరుడి రక్తంలో అత్యంత అరుదైన యాంటీబాడీ (antibodies) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై లోతుగా పరిశోధనలు చేయగా ఈ కొత్త గ్రూపు గుట్టు రట్టయింది. మన శరీరంలో 'ఎఫ్-11 ఆర్' (F11R) అనే జన్యువు ఉంటుంది. ఇది 'జామ్-ఏ' (JAM-A) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రొటీన్ ఆధారంగానే కొత్త బ్లడ్ గ్రూప్‌నకు 'జామా' అని నామకరణం చేశారు.

వీరికి సాధారణ రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది..?

జామా బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రక్తంలో.. సాధారణ మనుషుల్లో ఉండే ఒక ప్రత్యేకమైన యాంటిజెన్ ఉండదు. వీరికి అత్యవసర పరిస్థితుల్లో సాధారణ రక్తాన్ని ఎక్కిస్తే, రోగనిరోధక వ్యవస్థ కొత్త రక్తాన్ని శత్రువుగా భావించి దాడి చేస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం సంభవించే తీవ్రమైన రియాక్షన్స్ వస్తాయి. ఈ కొత్త ఆవిష్కరణ వల్ల భవిష్యత్తులో ఇలాంటి అరుదైన గ్రూపు ఉన్నవారిని డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా గుర్తించి, సురక్షితంగా రక్తం ఎక్కించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏది ఏ గ్రూపో ఎలా తెలుస్తుంది..?

అందరి రక్తం ఎర్రగానే ఉన్నప్పటికీ, అందరిదీ ఒకటే కాదు. ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటిజెన్స్ అంటే కొన్ని రకాల ప్రొటీన్లు, చక్కెరలు, ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ కలయికను బట్టే ఒకరి రక్తపు గ్రూపును నిర్ణయిస్తారు. ఈ ప్రొటీన్ అణువుల అమరిక వల్లే ఒకరి రక్తం మరొకరితో భిన్నంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

ఇటీవల వెలుగుచూసిన మరికొన్ని గ్రూపులు..

కొత్త బ్లడ్ గ్రూపులు బయటపడటం ఇటీవల కాలంలో ఇది మూడోసారి. మాల్ (MAL) గ్రూప్..2024 సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన బ్రస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు 'మాల్' అనే బ్లడ్ గ్రూప్‌ను కనుగొన్నారు. దీంతో 50 ఏళ్లుగా ఉన్న ఒక వైద్య రహస్యం వీడినట్లయింది.

క్రిబ్ (CRIB) గ్రూప్.. 2025 ఆగస్టులో భారత్, బ్రిటన్ శాస్త్రవేత్తలు కలిసి 'క్రిబ్' అనే మరో కొత్త గ్రూపును గుర్తించారు. భారత్‌లో 38 ఏళ్ల మహిళకు సర్జరీ కోసం రక్తం అవసరం కాగా, ఏ గ్రూపూ ఆమెకు సెట్ కాలేదు. ఏ రక్తం ఎక్కించినా రియాక్షన్ వస్తుండటంతో.. లోతుగా పరీక్షించి ఆమెది అత్యంత అరుదైన 'క్రిబ్' గ్రూప్ అని తేల్చారు.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.