New Study : కాఫీతో తగ్గేది బరువు కాదు.. శరీరంలోని కొవ్వు మాత్రమే.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాఫీ తాగితే ఫలితాలు కనిపించడానికి 12 వారాల అంటే మూడు నెలలు సమయం పడుతుందన్న విషయం తాజా క్లినికల్ పరిశోధనల ఆధారంగా కూడా నిరూపితమైంది. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా, కాఫీ మన శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందనే దానిపై ప్రముఖ జర్నల్ 'న్యూట్రియంట్స్' (Nutrients) 2024లో ప్రచురించిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

అధ్యయనం ఎలా సాగిందంటే..

ఈ పరిశోధన కోసం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 నుంచి 35 మధ్య అధిక బరువు ఉన్న 60 మందిని ఎంపిక చేశారు. వీరికి 12 వారాల మూడు నెలల పాటు రోజూ మూడు కప్పుల చొప్పున కాఫీ ఇచ్చారు.

ఆశ్చర్యపరిచిన ఫలితాలు..

మూడు నెలల తర్వాత వారి శరీరాల్లో జరిగిన మార్పులను గమనించిన పరిశోధకులు పలు విషయాలను గుర్తించారు. కొవ్వు కరిగింది.. లైట్ రోస్టెడ్ (Lightly roasted) కాఫీ తాగిన వారి శరీరంలో 1.4 శాతం కొవ్వు తగ్గగా, రెగ్యులర్ రోస్టెడ్ (Regular roasted) కాఫీ తాగిన వారిలో 1.0 శాతం మేర అదనపు కొవ్వు గణనీయంగా కరిగింది. కండరాల వృద్ధి.. కొవ్వు తగ్గడంతో పాటే, వారిలో కండరాల పరిమాణం (Muscle mass) కూడా కొద్దిగా పెరగడం విశేషం.

బరువు కాదు.. ఆకృతి మారుతుంది..!

ఈ అధ్యయనంలో గుర్తించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాల్గొన్న వారి శరీరంలో కొవ్వు కరిగి, కండరాలు పెరిగినప్పటికీ, వారి మొత్తం శరీర బరువులో మాత్రం ఎలాంటి గణనీయమైన మార్పు కనిపించలేదు. దీని అర్థం ఏమిటంటే.. తూకం వేసే యంత్రం (Weighing machine) మీద కనిపించే అంకెలు మారనంత మాత్రాన కాఫీ పనిచేయడం లేదని కాదు. ఇది నేరుగా బరువును తగ్గించడం కన్నా, శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించి మీ శరీర ఆకృతిని, నిర్మాణాన్ని (Body composition) అత్యంత ఆరోగ్యకరంగా మారుస్తుందని ఈ పరిశోధన బలంగా స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.