The Science Behind Painkillers : పెయిన్ కిల్లర్ పిల్స్ వెనుక ఉన్న సైన్స్.. శరీరంలో నొప్పి ఎక్కడ ఉందో నొప్పి నివారణ మందులకు ఎలా తెలుస్తుంది..?
సాక్షి లైఫ్ : తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి.. శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా మనం వెంటనే ఆశ్రయించేది నొప్పి నివారణ మాత్ర (painkiller). అయితే, మనం మింగే ఆ మాత్రకు శరీరంలో ఎక్కడ నొప్పి ఉందో ఎలా తెలుస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా..? అది నేరుగా నొప్పి ఉన్న చోటికే వెళ్లి పనిచేస్తుందా..? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
నొప్పి అసలు ఎలా తెలుస్తుంది..?
శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినా, వాపు వచ్చినా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇవి అక్కడున్న నరాలను (Pain receptors) ప్రేరేపిస్తాయి. ఆ నరాలు నొప్పికి సంబంధించిన సంకేతాలను ముందుగా వెన్నుపాముకు, అక్కడి నుంచి నేరుగా మెదడుకు చేరవేస్తాయి. మెదడు ఆ సిగ్నల్స్‌ను విశ్లేషించినప్పుడే మనకు నొప్పి అనే భావన కలుగుతుంది. అంటే నొప్పి అనేది కేవలం దెబ్బ తగిలిన చోట మాత్రమే జరిగే ప్రక్రియ కాదు, నరాలు, మెదడుతో ముడిపడి ఉన్న వ్యవస్థ.
నొప్పి ఉన్న చోటును మాత్ర నేరుగా గుర్తిస్తుందా..?
చాలామంది అనుకునే అతిపెద్ద అపోహ ఇది. మనం మాత్ర మింగగానే అది నేరుగా నొప్పి ఉన్న ప్రాంతానికే వెళ్లి పనిచేస్తుందని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. మాత్ర కడుపులోకి వెళ్లాక జీర్ణమై, రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా శరీరమంతా సరఫరా అవుతుంది. అయితే, శరీరంలో ఎక్కడైతే గాయం వల్ల రసాయనాలు (enzymes) చురుకుగా ఉన్నాయో, కచ్చితంగా ఆ ప్రాంతంలోని రిసెప్టార్లతో మాత్రమే ఈ మందులోని అణువులు కలిసి చర్య జరుపుతాయి. శరీరంలోని మిగతా భాగాల్లో అవి ఎలాంటి ప్రభావం చూపవు.
పెయిన్ కిల్లర్స్ ఎలా పనిచేస్తాయి..?
నొప్పి నివారణ మాత్రలు శరీరంలోని వివిధ దశల్లో పనిచేస్తాయి. అన్ని మాత్రలూ ఒకేలా పనిచేయవు. కొన్ని మందులు.. గాయమైన చోట నొప్పిని, వాపును పెంచే రసాయనాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి. వాపు, నొప్పి కలిసి ఉన్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. మరికొన్ని మందులు.. నరాల నుంచి మెదడుకు వెళ్లే నొప్పి సంకేతాలను (Pain signals) నెమ్మదించేలా లేదా ఆగిపోయేలా చేస్తాయి. తీవ్రమైన నొప్పులకు వాడే శక్తివంతమైన మందులు నేరుగా నాడీవ్యవస్థలోని ప్రత్యేక రిసెప్టార్లపై ప్రభావం చూపి మెదడు నొప్పిని గ్రహించకుండా చేస్తాయి.
నొప్పి తగ్గితే.. వ్యాధి తగ్గినట్లు కాదు..!
పెయిన్ కిల్లర్ వేసుకోగానే నొప్పి తగ్గిపోయింది కదా అని దెబ్బ లేదా జబ్బు నయమైపోయిందని అనుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ కేవలం మెదడుకు వెళ్లే నొప్పి సిగ్నల్స్‌ను మాత్రమే ఆపుతాయి తద్వారా నొప్పి అనుభూతిని తగ్గిస్తాయి. దానికి కారణమైన లోపలి సమస్య అక్కడే ఉంటుంది. సాధారణ భాషలో చెప్పాలంటే.. పెయిన్ కిల్లర్ అనేది 'నొప్పిని వెతికి పట్టుకునే మందు' కాదు, 'నొప్పి పుట్టే జీవక్రియను ఆపే మందు' మాత్రమే.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
