Deadly PM2.5 Particles : ప్రాణాంతకంగా పీఎం 2.5 కణాలు..ఈ అవయవాలపైనే పొల్యూషన్ ఎఫెక్ట్..!
సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదని, గాలిలోని అత్యంత సూక్ష్మ కణాలు (PM 2.5) కళ్లు, గుండె, రక్తనాళాలు, మెదడులోకి చొరబడి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకుని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులే కాకుండా ప్రాణాంతకమైన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అవయవాలపై కాలుష్య కణాల దాడి ఏ విధంగా ఉంటుందో పరిశీలిస్తే..కళ్లు, శ్వాసనాళాలపై తీవ్రం..కాలుష్య కారకాలు కళ్ల రక్షణ పొరను, తేమను దెబ్బతీసి మంటలు, ఎరుపుదనం, కళ్ల వెంట నీరు కారడం, తీవ్రమైన దురదకు కారణమవుతాయి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పీఎం 2.5 కణాలు శ్వాస ద్వారా నేరుగా ఊపిరితిత్తుల అట్టడుగు పొరల్లోకి చేరి శ్వాసనాళాల్లో వాపును కలిగిస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది. అలర్జీలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
గుండెకు ముప్పు..
సూక్ష్మ కణాలు రక్తంలో కలిసిపోయి రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడిని, వాపును (Inflammation) పెంచుతాయి. దీర్ఘకాలం పాటు కాలుష్య వాతావరణంలో గడిపితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. ఇప్పటికే అధిక రక్తపోటు (bp), మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిపై ఈ కాలుష్య కణాల దుష్ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.
మెదడు ఆరోగ్యానికీ ప్రమాదమే..
వాయు కాలుష్య ప్రభావం మెదడుపై కూడా పడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాలుష్యం కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి, మెదడుకు రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీసే పర్యావరణ ముప్పుల్లో కాలుష్యం కూడా ఒకటి. ముఖ్యంగా ఎదుగుతున్న చిన్నారుల మెదడు వికాసంపై కలుషిత గాలి తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది.
నిశ్శబ్దంగా దెబ్బతీసే క్రానిక్ వ్యాధులు..
కాలుష్యం బారిన పడటం వల్ల శరీరంలో 'ఆక్సిడేటివ్ స్ట్రెస్' పెరుగుతుంది. కణాలపై హానికర రసాయనాల ఒత్తిడి పెరిగి, కణాలు దెబ్బతింటాయి. ఎలాంటి ముందస్తు లక్షణాలు బయటపడకుండానే లోపల క్యాన్సర్ వంటి క్రానిక్ వ్యాధులు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. కాలుష్యం అధికంగా ఉండే రోజుల్లో బయట తిరగడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఉదయం పూట మంచు, పొగమంచు (Smog) ఉన్న సమయాల్లో ఆరుబయట వ్యాయామాలు, కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
