Obesity-Hormonal Balance : ఊబకాయంతో హార్మోన్ల సమతుల్యత గల్లంతు..! : నిపుణుల హెచ్చరిక..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో పేరుకుపోయే కొవ్వు కేవలం బరువు పెరగడానికి మాత్రమే కాదు.. మన శరీరంలోని అత్యంత కీలకమైన హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలామంది ఊబకాయాన్ని కేవలం శరీర సౌందర్యానికి సంబంధించిన సమస్యగా లేదా బరువు పెరగడంగా మాత్రమే భావిస్తారు. కానీ, ఇది అంతకంటే చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు కారణంగా డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ వంటి సాధారణ సమస్యలే కాకుండా, ప్రాణాంతక హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

కొవ్వు కణజాలం చేసే ప్రమాదం ఏమిటి..?

శరీరంలో ఉండే కొవ్వు కణజాలం కేవలం శక్తిని నిల్వ ఉంచే పని మాత్రమే చేయదు. ఇది అనేక హార్మోన్ల సంకేతాల( hormonal signals)ను ప్రభావితం చేస్తుంది. ఆకలి, జీవక్రియ (metabolism), ఇన్సులిన్ స్థాయిలు, ప్రత్యుత్పత్తి సామర్థ్యం, శరీరంలో ఇన్ఫ్లమేషన్) వంటి ప్రక్రియలన్నింటినీ ఈ కొవ్వు కణజాలం శాసిస్తుంది.

పురుషులు, మహిళలపై పడే ప్రభావాలు ఇవే..

ఊబకాయం కారణంగా మహిళల్లో పీసీఓఎస్ (PCOS), నెలసరి సక్రమంగా రాకపోవడం, హార్మోన్ల మార్పుల వల్ల ముఖంపై అనవసరమైన రోమాలు రావడం, గర్భధారణలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. పురుషుల్లో లో-టెస్టోస్టెరోన్..పురుషులలో శరీర బరువు పెరిగితే టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయి గణనీయంగా పడిపోతుంది. ఇది ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఊబకాయం వల్ల శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి శరీరం ఎక్కువ ఇన్సులిన్‌ను విడుదల చేయాల్సి వస్తుంది. ఇది చివరకు టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. లెప్టిన్ హార్మోన్ లోపం..ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ సంకేతాలు మెదడుకు అందడంలో అంతరాయం ఏర్పడుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా..?

కేవలం మందులు వాడడం వల్ల మాత్రమే ఈ హార్మోన్ల సమస్యలను పూర్తిగా నయం చేయలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకమైన జీవనశైలి మార్పులు ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం వల్ల హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. 

పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలను దినచర్యలో భాగం చేసుకోవాలి. మీకు ఎప్పటి నుంచైనా హార్మోన్ల సంబంధిత సమస్యలు లేదా నెలసరి ఇబ్బందులు ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.