హెయిర్ ఫాల్ సమస్యకు తమలపాకుతో చెక్ పెట్టొచ్చు.. అదెలా అంటే..?
సాక్షి లైఫ్ : ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరిస్తే కొన్నిరకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.
ఎలాంటి హానిలేని ఉత్తమ చిట్కాలు అందించే ఆరోగ్య నిపుణుల సలహాలను పాటిస్తే ఆయా అసమస్యలకు సరైన పరిష్కారాలు పొందవచ్చు. వైద్య నిపుణులు అందించిన కొన్ని చిట్కాలు.. ఉన్నాయి. అవేంటంటే..?
జుట్టు రాలు సమస్యకు సరైన పరిష్కారం..
-ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి.
-ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి.
-ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి.
గంట తరువాత నీటితో కడిగేయాలి.
-ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది.
-జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
-అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.
-ఈ విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
