శానిటరీ ప్యాడ్స్ వినియోగం కారణంగా సంతానలేమి సమస్యలు వస్తాయా..?
సాక్షి లైఫ్ : శానిటరీ ప్యాడ్స్ వినియోగం కారణంగా క్యాన్సర్, సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) వెల్లడిస్తోంది. మరోపక్క శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని, కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే నెలసరి సమయంలో మెన్ట్రువల్ కప్స్ వినియోగించడం ఉత్తమమని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ప్రస్తుతం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నిరకాల రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువగా థాలేట్స్, కర్బన సమ్మేళనాలు వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ వంటి విషపూరితమైన కెమికల్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కువరోజులు చెక్కుచెదరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు శానిటరీ ప్యాడ్స్ తయారీ సంస్థలు థాలేట్స్ ను మిక్స్ చేస్తున్నాయి. థాలేట్స్ యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తాయి.
గత 40 ఏళ్ల క్రితం చాలా మంది మెత్తటి చీరలను లేదా పంచలను ఇందుకోసం ఉపయోగించేవాళ్లు. అవి కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఎందుకంటే బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్స్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. పలు ఎంజీవో సంస్థలు క్లాత్ తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్‌ను అందిస్తున్నాయి. అటువంటివాటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
