Eyebrow Threading : ఐబ్రోస్ కు థ్రెడింగ్ చేయించుకుంటే వచ్చే సమస్యలు మీకు తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ముఖానికి మరింత ఆకర్షణ తీసుకురావడానికి కనుబొమ్మలను (Eyebrows) అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం మహిళలు థ్రెడింగ్ చేయించుకోవడం సర్వసాధారణం. నిమిషాల వ్యవధిలో అవాంఛిత రోమాలను తొలగించి అందమైన రూపాన్నిచ్చే ఈ బ్యూటీ ట్రీట్‌మెంట్ పూర్తిగా సురక్షితం కాదని మీకు తెలుసా..? వెంట్రుకలను కుదుళ్ల నుంచి లాగే ఈ ప్రక్రియ వల్ల చర్మంపై పలు దుష్ప్రభావాలు (Side effects) పడే అవకాశం ఉంది. సరైన నైపుణ్యం లేనివారి వద్ద, పరిశుభ్రత లోపించిన పార్లర్లలో థ్రెడింగ్ చేయించు కుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడక తప్పదు. కాబట్టి, బ్యూటీ పార్లర్‌కు వెళ్లే ముందు దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

 

థ్రెడింగ్ వల్ల దుష్ప్రభావాలు..

ఎరుపుదనం, మంట: థ్రెడింగ్ చేసిన వెంటనే కనుబొమ్మల చుట్టూ చర్మం ఎర్రబడటం, మంట పుట్టడం సాధారణంగా కనిపించే సమస్య. సున్నితమైన చర్మం (Sensitive skin) ఉన్నవారిలో ఈ మంట, వాపు కాస్త ఎక్కువ సమయం పాటు బాధిస్తుంది.

చిన్నపాటి దద్దుర్లు..

వెంట్రుకలను మూలాల నుంచి లాగడం వల్ల చర్మ రంధ్రాల్లో (Hair follicles) వాపు వస్తుంది. దీనివల్ల థ్రెడింగ్ చేసుకున్న ప్రదేశంలో చిన్నపాటి ఎర్రటి దద్దుర్లు, దురద లేదా మొటిమల్లాంటి కురుపులు వస్తాయి.

ఇన్ఫెక్షన్ ముప్పు..

 థ్రెడింగ్ చేసేటప్పుడు సరైన పరిశుభ్రత పాటించకపోతే, చర్మ రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. దీనివల్ల నొప్పి, తీవ్రమైన వాపు లేదా చీముతో కూడిన కురుపులు రావచ్చు.

 కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. థ్రెడింగ్ చేసే బ్యూటీషియన్‌కు సరైన అనుభవం లేకపోయినా, దారంపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టినా చర్మం గీసుకుపోవడం లేదా చిన్నపాటి కట్స్ పడటం జరుగుతుంది.

షేప్ మారడం..

 అనుభవలేమి కారణంగా కొన్నిసార్లు అవసరమైన వాటికంటే ఎక్కువ వెంట్రుకలు తీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కనుబొమ్మల ఆకృతి దెబ్బతింటుంది. తిరిగి ఆ వెంట్రుకలు పెరిగి పాత షేప్‌కు రావడానికి చాలా సమయం పడుతుంది.

థ్రెడింగ్ చేయించుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

తగినంత అనుభవం ఉండి, పరిశుభ్రతను కచ్చితంగా పాటించే పార్లర్లను మాత్రమే ఎంచుకోవాలి. మీకు థ్రెడింగ్ చేయడానికి ముందు బ్యూటీషియన్ చేతులు శుభ్రంగా కడుక్కున్నారా లేదా, అలాగే ప్రతి కస్టమర్‌కు కొత్త దారాన్ని ఉపయోగిస్తున్నారో లేదో గమనించాలి. మీ చర్మంపై అప్పటికే ఏవైనా గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా మంట ఉంటే.. అవి తగ్గే వరకు థ్రెడింగ్ వాయిదా వేసుకోవడం ఉత్తమం.

చర్మ సౌందర్యం కోసం రెటినాల్ (Retinol) లేదా ఇతర చర్మ సంబంధిత క్రీమ్స్ వాడుతున్నవారు థ్రెడింగ్ చేయించుకునే ముందు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి మరి..?

సాధారణంగా థ్రెడింగ్ తర్వాత వచ్చే ఎరుపుదనం కాసేపటికి తగ్గిపోతుంది. కానీ, వాపు రెండు మూడు రోజులైనా తగ్గకపోయినా, ఎరుపుదనం పెరుగుతున్నా, భరించలేని నొప్పి లేదా చీముతో కూడిన కురుపులు వచ్చినా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని (Dermatologist) సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.