Grandma's Pregnancy Advice : గర్భిణులకు అమ్మమ్మల సలహాలు చాదస్తం కాదు.. వాటి వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో ఇంట్లోని పెద్దలు, ముఖ్యంగా అమ్మమ్మలు, నానమ్మలు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. నేటితరం వాటిని పాతకాలం నాటి పద్ధతులుగానో, మూఢనమ్మకాలుగానో కొట్టిపారేస్తుంటుంది. ఆధునిక వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడే ప్రస్తుత రోజుల్లో పెద్దల మాటలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఆ మాటల వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు (Scientific Reasons) దాగి ఉన్నాయని వైద్య నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రముఖ గైనకాలజిస్టులు వివరించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

 

పెద్దలు చెప్పే మాటల వెనుక ఉన్న సైన్స్..


నెయ్యి తప్పనిసరిగా తినాలి..
 
పెద్దల మాట..గర్భిణులు రోజూ కచ్చితంగా నెయ్యి తినాలి..

సైన్స్ ఏమంటోంది..?

వైద్య పరిభాషలో దీనిని 'ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంటేషన్' అంటారు. నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ (Butyric acid) గర్భస్థ శిశువు మెదడు వికాసానికి, పేగుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే, గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది.

కోపానికి దూరంగా ఉండాలి..

పెద్దల మాట..గర్భిణులు కోపగించుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి.

సైన్స్ ఏమంటోంది..? 

తల్లి కోపగించుకుంటే ఆ ప్రభావం నేరుగా బిడ్డపై పడుతుంది. దీన్నే 'మెటర్నల్ కార్టిసోల్ ట్రాన్స్‌ఫర్' (Maternal Cortisol Transfer) అంటారు. తల్లి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు విడుదలయ్యే హార్మోన్లు మాయ (Placenta) ద్వారా బిడ్డకు చేరుకుని, శిశువు నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

కడుపులోని బిడ్డతో మాట్లాడాలి.. పాటలు పాడాలి

పెద్దల మాట..పుట్టబోయే బిడ్డతో మాట్లాడుతూ, మంచి మంచి కథలు చదవాలి.

సైన్స్ ఏమంటోంది..? 

గర్భం దాల్చిన 18 వారాలకే పిండానికి వినికిడి శక్తి వస్తుందని సైన్స్ చెబుతోంది. ఆ సమయంలో తల్లి బిడ్డతో మాట్లాడటం, పాటలు పాడటం, మంచి పుస్తకాలు చదవడం వల్ల తల్లీబిడ్డల మధ్య  మానసిక బంధం మరింతగా బలపడుతుంది. ఈ విషయాన్ని సైన్స్ పూర్తిగా సమర్థిస్తోంది.

ఒంటరిగా భోజనం చేయకూడదు

పెద్దల మాట: గర్భిణులు అందరితో కలిసే భోజనం చేయాలి.

సైన్స్ ఏమంటోంది..? 

 దీని వెనుక 'సైకో-సోషల్ మోడల్' దాగి ఉంది. భోజనం చేసే సమయంలో మహిళ మానసిక స్థితి ఎలా ఉందనేది జీర్ణక్రియపై, పోషకాల శోషణపై ప్రభావం చూపుతుంది. ఒంటరిగా తినడం వల్ల గర్భధారణ సమయంలో యాంగ్జయిటీ, డెలివరీ తర్వాత డిప్రెషన్ (Postpartum Depression) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తగినంత విశ్రాంతి అవసరం

పెద్దల మాట..గర్భిణులు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.

సైన్స్ ఏమంటోంది..? 

విశ్రాంతి అనేది కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, ఇది బిడ్డకు 'న్యూరోలాజికల్ ప్రొటెక్షన్' అంటే నాడీ సంబంధిత రక్షణ ఇస్తుంది. తల్లి ఎంత విశ్రాంతి తీసుకుంటే శిశువు నాడీ వ్యవస్థ అంత ఆరోగ్యంగా ఎదుగుతుంది.

నూనెతో మర్దన..

పెద్దల మాట..కడుపు, కాళ్లు, తలకు నూనె రాసి మర్దన చేయాలి.

సైన్స్ ఏమంటోంది..? నూనెతో సున్నితంగా చేసే మర్దన వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇది కార్టిసోల్ (stress hormone)స్థాయిలను, గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి తల్లీబిడ్డలకు ఒక రకమైన భద్రతా భావాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇంట్లోని పెద్దలు చెప్పే ప్రతి మాటా మూఢనమ్మకం కాదు. వారి అనుభవంలో ఎంతో సైన్స్ దాగి ఉందని ఆధునిక వైద్యం కూడా స్పష్టం చేస్తోంది. కాబట్టి గర్భధారణ సమయంలో వైద్యుల సూచనలతో పాటు, పెద్దల సలహాలను పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.