Increase Hemoglobin Levels Naturally : రక్తహీనతకు చెక్ పెట్టండి.. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచే అద్భుతమైన ఆహారాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల్లో రక్తహీనత (Anemia) సమస్య చాలా సాధారణం. తరచూ వచ్చే నీరసం, అలసట, తలతిరగడం లేదా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్లనే వస్తుంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడం వల్ల మహిళల్లో ఐరన్ లోపం తీవ్రమవుతుంది. శరీరంలో ఆక్సిజన్‌ను అన్ని భాగాలకు చేరవేసే హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ (Iron) ఎంతో అవసరం. అందుకే రోజూవారీ ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను సహజంగానే దూరం చేసుకోవచ్చు. మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను సాధారణ స్థితికి తెచ్చే కొన్ని ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

మహిళల్లో రక్తహీనతకు కారణాలు ఏమిటంటే..?

పీరియడ్స్(menstruation)సమయంలో అధిక రక్తస్రావం కావడం. గర్భధారణ సమయంలో ఐరన్ అవసరాలు పెరగడం. ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేకపోవడం. ఫలితంగా తీవ్రమైన అలసట, తలనొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాలు..

ఆకుకూరలు.. పాలకూర (Spinach), ఇతర ఆకుకూరల్లో ఐరన్‌తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. శనగలు, రాజ్మా.. తెల్ల శనగలు, బఠానీలు, రాజ్మా, ఇతర బీన్స్ రకాలు ఐరన్‌కు మంచి వనరులు. శాకాహారులు తమ డైట్‌లో వీటిని కచ్చితంగా చేర్చుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు, మసూర్‌దాల్ వంటి పప్పుల్లో ఐరన్ లభిస్తుంది. రోజూ సరైన మోతాదులో పప్పు తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తీరుతుంది.

హిమోగ్లోబిన్ స్థాయిలు..

సీడ్స్..నువ్వులు, గుమ్మడి గింజలు వంటి వాటిలో ఐరన్ ఉంటుంది. వీటిని సలాడ్స్, అల్పాహారంలో పరిమితంగా తీసుకోవచ్చు.నాన్ వెజ్ ప్రియుల విషయంలో.. మాంసం, చేపలు,చికెన్ వంటి వాటిలో ఉండే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఆహారంలో మార్పులు చేయడం మంచిదే అయినప్పటికీ, హిమోగ్లోబిన్ స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోయినప్పుడు లేదా తీవ్రమైన ఐరన్ లోపం ఉన్నప్పుడు కేవలం ఆహారంతోనే సరిపోదు. అలాంటి సమయంలో వైద్యులను సంప్రదించి తగిన ఐరన్ సప్లిమెంట్లు లేదా చికిత్స తీసుకోవాలి. ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా దీర్ఘకాలికంగా మందులు వాడటం సరైన పద్ధతి కాదు.

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.