Reduce Breast Cancer Risk : బ్రెస్ట్ క్యాన్సర్‌ ను జీవనశైలి ద్వారా గణనీయంగా తగ్గించవచ్చంటున్న పరిశోధకులు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళలను వణికిస్తున్న రొమ్ము క్యాన్సర్ ముప్పును కేవలం సరైన ఆహార నియమాలు, చురుకైన జీవనశైలి ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేసింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, రెడ్ మీట్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని 'ది లాన్సెట్ ఆంకాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన నివేదిక హెచ్చరిస్తోంది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో సుమారు 33 ఏళ్ల పాటు జరిగిన ఈ పరిశోధనలో ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కారకాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది విశ్లేషించారు. ముఖ్యంగా భారతదేశంలో 1990తో పోలిస్తే రొమ్ము క్యాన్సర్ కేసులు రెట్టింపు కావటం ఆందోళన కలిగిస్తోంది.

క్యాన్సర్ ముప్పు పెంచే కారకాలివే..

ప్రాసెస్ చేసిన మాంసం (Red Meat): ఇది క్యాన్సర్ మరణాల ముప్పును 12శాతం పెంచుతోంది.

చిప్స్, బిస్కట్లు, శీతల పానీయాల వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ముప్పు 25శాతం పెరుగుతుంది.

 నిత్యం మద్యం సేవించడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం 7-10శాతం ఎక్కువగా ఉంటుంది.

 ఆహారమే ప్రధానం.. 

మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ ముప్పును 38-40శాతం వరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరి ఏమి తినాలి..?

తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, గింజలు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి.
పీచు (Fiber) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ముప్పు 5-12శాతం తగ్గుతుంది.

నిపుణులు ఏమంటున్నారు..?

వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో ఈ వ్యాధి పెరుగుతోందని సీనియర్ ఆంకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని, నడుము చుట్టుకొలత పెరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు.. 

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. అధిక బరువు వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగి క్యాన్సర్‌కు దారితీయవచ్చు. రొమ్ములో గడ్డలు, ఆకారం మారడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.