మహిళల ఆరోగ్యానికి ఈ ఐదు విటమిన్లు చాలా అవసరం.. 

షేర్ చేయండి:
మహిళల ఆరోగ్యానికి ఈ ఐదు విటమిన్లు చాలా అవసరం.. 

సాక్షి లైఫ్ : విటమిన్ D3, విటమిన్ C, విటమిన్ B12, విటమిన్ B9, విటమిన్ B6తో సహా అవసరమైన విటమిన్ల సమతుల్య వినియోగం మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి కీలకం. పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన వివిధ ఆహార వనరుల నుంచి ఈ విటమిన్‌లను పొందవచ్చు. మహిళల ఆరోగ్యంలో విటమిన్లు, ఖనిజాల సమతుల్య వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యం నుంచి హార్మోన్ల వరకు, విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ చాలా మంది మహిళలకు వాటి గురించి తెలియదు.

95శాతం మంది మహిళలు హార్మోన్ల సమస్యలు లేదా ఇతర విటమిన్ లోపాలతో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందు కోసమే పోషకాహార నిపుణులు మహిళల ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొన్నిరకాల విటమిన్లు తీసుకోవాలని సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ స్థాయిలు సరిపడా ఉండాలి. లేకపోతే వారు పాలవ్యాధులకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిష్కారం కోసం ఐదు ముఖ్యమైన విటమిన్లు, వాటి కీలక పాత్రలు, ఆయా విటమిన్లు లభించే ఉత్తమ ఆహార వనరులు ఏవంటే..?  

 
 హార్మోన్ల సమస్యను పరిష్కరించడానికి అవసరమైన విటమిన్లు, ఉత్తమ ఆహార వనరులు 

విటమిన్ D3: 

ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (PMS),పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఇన్సులిన్ నిరోధకత, ఋతు చక్రం, టెస్టోస్టెరాన్ , లిబిడోను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహార వనరులు: విటమిన్ D3 ఉత్తమ మూలంసూర్యరశ్మి. చేప, గుడ్లులో విటమిన్ D3ని పొందవచ్చు. 
 
విటమిన్ "సి": 

ఇది ప్రొజెస్టెరాన్, సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆహార వనరులు: పుల్లని పండ్లు, నిమ్మకాయ, ఆరెంజ్ తోపాటు బ్రోకలీ, టమోటాలు, క్యాప్సికమ్‌లలో విటమిన్ "సి" ఎక్కువగా లభిస్తుంది.
 
విటమిన్ B12:

 ఇది రెడ్ బ్లడ్ సెల్స్ (ఎర్ర రక్త కణాలు) ఏర్పడటానికి, థైరాయిడ్ ఆరోగ్యంగాఉంచడానికి , DNA సంశ్లేషణలో సహాయపడుతుంది.
ఆహార వనరులు: ఇది ఎక్కువగా మాంసం, పౌల్ట్రీ, చేపలు , గుడ్లలో లభిస్తుంది.
 
విటమిన్ B9: 

ఇది గర్భధారణ, సంతానోత్పత్తి DNA సంశ్లేషణలో సహాయపడుతుంది. ఆహార వనరులు: ఆకు కూరలు, కూరగాయలు తృణధాన్యాలు ఉత్తమ వనరులు.
 
విటమిన్ B6: 

ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) ,ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్(PMDD), అడ్రినల్ గ్రంథులు బాగా పనిచేయడానికి, మంచి నిద్ర, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలోనూ విటమిన్ B6 సహాయపడుతుంది. ఆహార వనరులు: ఇది మాంసం, అరటిపండ్లు, బంగాళదుంపలు, చికెన్ బ్రెస్ట్ , అవోకాడో వంటివి తీసుకోవడం ద్వారా ఎక్కువగా పొందవచ్చు.  

ఇది కూడా చదవండి.. రెడ్ చిల్లీతో సైడ్ ఎఫెక్ట్స్ .. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.