సాక్షి లైఫ్ : క్యాన్సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోభాగంగా చాలామంది మహిళలు ఏడాదికోసారి మామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటే రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే మామోగ్రామ్ అనేది క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడానికి అత్యంత కీలకమైన పరీక్ష అనడంలో సందేహం లేదు. కానీ, అది అందరికీ సరిపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పరీక్షల మీద మాత్రమే ఆధారపడకుండా, అసలు మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం (Lifetime Risk) ఎంత ఉందో ముందుగా అంచనా వేసుకోవడం నివారణలో మొదటి మెట్టు అని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
రిస్క్ ఎంతో ఎలా తెలుసుకోవాలి..?
రొమ్ము క్యాన్సర్‌ను నివారించాలంటే, అధిక ముప్పు ఉన్న మహిళలను గుర్తించడం చాలా ముఖ్యం అని మహిళా ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ లిసా లార్కిన్ పేర్కొంటున్నారు. చాలా మంది మహిళలకు తమ వ్యక్తిగత రిస్క్ గురించి అవగాహన ఉండదు. దీనివల్ల అధిక ముప్పు ఉన్నవారు కూడా కేవలం మామోగ్రామ్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. నిజానికి అటువంటి వారికి మామోగ్రామ్‌తో పాటు బ్రెస్ట్ MRI లేదా అల్ట్రాసౌండ్ వంటి అదనపు పరీక్షలు కూడా అవసరమవుతాయి.
అంచనా వేయడం ఎలా అంటే..?
వయస్సు, కుటుంబ చరిత్ర (Family History), జన్యుపరమైన అంశాలు, రొమ్ము సాంద్రత (Breast Density) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిస్క్ స్కోరును లెక్కించవచ్చు. దీనికోసం ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే కొన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
టైరర్-కుజిక్ మోడల్ (Tyrer-Cuzick Model), గేల్ మోడల్ (Gail Model)ఇవి రెండూ బ్రెస్ట్ క్యాన్సర్ అసెస్మెంట్ టూల్స్ . వీటి ద్వారా పరీక్షించి వచ్చే ఫలితాలను వైద్యనిపుణులతో చర్చించాలి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిబంధనల ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ ముప్పు 20 శాతం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు ఏటా మామోగ్రామ్‌తో పాటు బ్రెస్ట్ ఎం ఆర్ఐ కూడా చేయించుకోవాలి.
జీవనశైలితో ముప్పునకు చెక్..
కుటుంబ చరిత్ర వంటి కొన్ని అంశాలను మనం మార్చలేము కానీ, మన చేతుల్లో ఉన్న అలవాట్లతో ముప్పును తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు మద్యం అలవాటును పూర్తిగా మానుకోవడం ఉత్తమం. శారీరక శ్రమ రొమ్ము క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. వార్షిక పరీక్షలతో పాటు, మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని విశ్లేషించుకోవడం ముఖ్యం. వైద్యుడిని కలిసినప్పుడు రిస్క్ స్కోరు గురించి చర్చించి, మీకంటూ ఒక ప్రత్యేకమైన 'స్క్రీనింగ్ ప్లాన్' సిద్ధం చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com