ప్రీ-మెనోపాజ్ వంటి సమస్యలు ఎలాంటి వాళ్లలో ఎక్కువగా వస్తాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఈస్ట్రోజెన్. సాధారణంగా చిన్న వయసులోనే పీరియడ్స్‌ ఆగి పోవడాన్ని "ప్రీ-మెనోపాజ్‌" అంటారు. ఈ కాలంలో, మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రీ-మెనోపాజ్ సమస్య జీవనశైలి లో మార్పులు ,ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమస్య అని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..? 

ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?

ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?

 

ముఖ్యంగా మహిళల్లో ప్రీ-మెనోపాజ్ రావడానికి చాలా కారణాలున్నాయి. 45 -55 సంవత్సరాల మధ్య వయస్సులో మహిళల అండాశయాలు గుడ్లు ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. 


ప్రీ-మెనోపాజ్ లక్షణాలు..ఎలా ఉంటాయి..?  

ప్రీ-మెనోపాజ్ సమయంలో మహిళలకు చిరాకు, యోనిలో దురద, రొమ్ములలో వాపు, అధిక వేడి, రొమ్ములలో తేలికపాటి నొప్పి, లైంగిక కోరిక కోల్పోవడం, మానసిక సమస్య, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు పని చేయకపోయినా చేసినా ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు మెనోపాజ్‌కు 6-7 నెలల ముందు కనిపిస్తాయి.


ప్రీ-మెనోపాజ్‌కి కారణాలు..? 
 
అండాశయాలలో శస్త్రచికిత్స, ఏదైనా వ్యాధికి ఇచ్చే రేడియేషన్, అతిగా మద్యం సేవించడం,ధూమపానం చేయడం, కీమోథెరపీ, వంశ పారంపర్యంగా కూడా ప్రీ-మెనోపాజ్ తలెత్తడానికి అవకాశాలుంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇది కాకుండా, కొన్ని ఆటో ఇమ్యూన్ పరిస్థితులు లేదా ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్‌లు ఆడవారిలో సర్వసాధారణంగా ఉంటాయి. దీని కారణంగా పీరియడ్స్ సడెన్ గా ఆగిపోతాయి.

 

ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బంగాళదుంపలు ఎందుకు తీసుకోకూడదు..? 

ఇది కూడా చదవండి..Healthy walking : వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే..? 

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.