గర్భం దాల్చడానికి ముందు ఈ టెస్టులు తప్పనిసరి
సాక్షి లైఫ్ : గర్భం దాల్చడానికి ముందు పలురకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. అందుకోసం మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధం కావాలి. ఇలా రెండురకాలుగా రెడీగా ఉండడం వల్ల గర్భధారణ సమయంలో సంభవించే సమస్యల నుంచి సురక్షితంగా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే గర్భం దాల్చడానికి ముందు కొన్నిరకాల పరీక్షలు చేయించడం వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడాచాలా మంచిది. గర్భం దాల్చడానికి ముందు ఎలాంటి పరీక్షలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..
జనరల్ హెల్త్ చెకప్..
ఇవి చాలా సాధారణమైనవి. చాలా మంది మహిళలు గర్భం దాల్చిన తర్వాత, రొటీన్ చెకప్‌లు అవసరమవుతాయని అనుకుంటారు. ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయవలసిన అవసరం ఏమిటి..? అంటే తప్పకుండా ముందుగా కొన్ని పరీక్షలు చేయించాలి. గర్భం దాల్చక ముందే, సాధారణ పరీక్షలు..చేయించడం ద్వారా అనేక సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి.. వెరికోస్ వెయిన్స్ కు చికిత్స తీసుకోకపోతే ఏమౌతుంది..?
జన్యు పరీక్ష..
గర్భం దాల్చడానికి ముందు అనేక జన్యు పరీక్షలు కూడా చేయించాలి. ఇలా చేయించడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ప్రీఇంప్లాంటేషన్ జన్యు పరీక్ష (పీజీటీ), ఇంప్లాంటేషన్‌కు ముందు పిండంలో జన్యుపరమైన లోపాలు గుర్తించడానికి వీలవుతుంది. థైరాయిడ్ టెస్ట్, హెచ్ ఐవీ టెస్టులు చేయించాలి.
టీకా..
కొన్ని టీకాలు అనేక సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందులో ముఖ్యమైనవి గవదబిళ్లలు, మీజిల్స్, రుబెల్లా (ఎంఎంఆర్)రాకుండా వేసే టీకాలు. గర్భధారణ సమయంలో రుబెల్లా చాలా సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది.
మెంటల్ హెల్త్ చెకప్..
మానసికంగా సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు మీకే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా అనేక రకాలుగా హాని కలిగించవచ్చు. ఇప్పటికే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలతో సతమతమవుతుంటే, ముందుగా చికిత్స చేయించుకుని, గర్భం దాల్చడం గురించి ఆలోచించండి.
ఇది కూడా చదవండి.. యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే..? ఏం చేయాలి..?
ఎస్టీఐ టెస్ట్..
గర్భం దాల్చడానికి ముందు సెక్సువల్ ట్రాన్స్మిట్టెడ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ (ఎస్టీఐ)చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకపోతే కొందరికి గర్భం సమయంలో అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా పుట్టిన బిడ్డకు కూడా కొన్ని సమస్యలు తెలెత్తుతాయి. నెలలు నిండకుండానే ప్రసవించడం, పిల్లల తక్కువ బరువుతో పుట్టడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లు రావడం జరుగుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
