సాక్షి లైఫ్ : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు, మెదడు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. దీని కోసం, వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు ఒత్తిడిని తగ్గించగల కొన్ని ఆయుర్వేదపానీయాలు తీసుకోవాలని వారు అంటున్నారు.. అవేంటంటే..?
భారతదేశంలో పురాతన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సను అనుసరిస్తున్నారు. శారీరక సమస్య అయినా లేదా చర్మ సంబంధిత సమస్య అయినా, ఆయుర్వేదంలో దాదాపు ప్రతి సమస్యకు నివారణ ఉంది. నేటి వేగవంతమైన జీవితంలో, ఆందోళన అనేది ఒక సాధారణ సమస్య, ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. దీనిని నివారించడానికి, ఆయుర్వేదంలో అనేక రకాల ఆయుర్వేద పానీయాలు, సహజ పానీయాలు ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చొ..చూద్దాం..
ఉసిరి, భృంగరాజ్, మెంతులు, మందారం, కొబ్బరి నీరు, వేప, ధనియాలు గింజల, బ్రహ్మి, త్రిఫల, అశ్వగంధ వంటి అనేక ఇతర మూలికలు ఉన్నాయి. ఇవి సహజ నివారణలలో ప్రయోజనకరమైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా వెంట్రుకలు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో కొన్నిహెర్బల్ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
-ఉసిరి రసం
ఉసిరికాయను ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా అంటారు. ఇందులో జుట్టును బలోపేతం చేసే లక్షణాలుంటాయి. విటమిన్ "సి", యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరి రసం జుట్టు కుదుళ్లకు పోషణనిస్తుంది, వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- భృంగరాజ్ "టీ"
"ఫాల్స్ డైసీ" అని పిలిచే భృంగరాజ్ శతాబ్దాలుగా ఆయుర్వేద జుట్టు సంరక్షణకు మూలస్తంభంగా ఉంది. ఈ ఆకులను "టీ"లో కలిపి తాగడం వల్ల దానిలోని పోషకాలుశరీరానికి అందుతాయి. అంతేకాదు తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ హెర్బల్ డ్రింక్ జుట్టు పల్చబడడాన్ని నివారించి, కొత్తగా వచ్చే జుట్టుకు పోషణను అందిస్తుంది.
-మెంతి నీరు
మెంతి గింజల్లో ప్రొటీన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడమేకాకుండా వెంట్రుకలు విరిగిపోకుండా నిరోధిస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా హెయిర్ నిగ నిగ లాడుతుంది.
-మందార పువ్వు "టీ"..
మందార పువ్వులో విటమిన్లు , అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మందారంలో ఉండే అనేక పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మందారంపువ్వు రేకులను"టీ"లో కలుపుకొని తాగడం వల్ల అణిగిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది. జుట్టు రాలడం, చుండ్రు నివారించడంలో మందారం పువ్వులు ఎంతగానో సహాయపడతాయని వైద్య నిపుణులు అంటున్నారు.
- కొబ్బరి నీళ్లు..
కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరినీళ్లలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
-వేప నీరు..
వేపలో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. తలను ను శుభ్రపరిచి, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వేప ఆకులను నీటిలో మరిగించి తాగితే.. రక్తం శుద్ధి అయ్యి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ధనియాల గింజల నీరు
ధనియాల గింజలు డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడానికి తోడ్పడుతాయి. ధనియాల గింజలను రాత్రంతా నానబెట్టి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
-బ్రహ్మీ "టీ"
జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, బ్రహ్మి "టీ" మనస్సు, శరీరం రెండింటినీ శాంతపరచడానికి టానిక్‌గా పనిచేస్తుంది. బ్రహ్మి, అడాప్టోజెనిక్ హెర్బ్, ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రశాంతమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరం, జుట్టు పెరుగుదలకు బ్రహ్మీ "టీ" ఉపయోగపడుతుంది.
త్రిఫల కషాయం..
త్రిఫల అనేది మూడు శక్తివంతమైన ఆయుర్వేద పండ్ల కలయిక. అవి తానికాయ, ఉసిరికాయ,కరక్కాయ. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
-అశ్వగంధ..
బ్రహ్మి వలె, అశ్వగంధ కూడా శక్తివంతమైనది. ఇది ఒత్తిడితో పోరాడుతుంది. అశ్వగంధ పొడిని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com