Expert Guidelines : విజృంభిస్తున్న కొత్త వైరస్ వేరియంట్: సబ్-క్లేడ్ కె నివారణకు నిపుణుల మార్గదర్శకాలు..!
సాక్షి లైఫ్ : ఇన్‌ఫ్లుయెంజా ఏ (H3N2) లో వస్తున్న మార్పులు ఆరోగ్య రంగానికి సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వెలుగుచూసిన 'సబ్-క్లేడ్ కె' వేగంగా వ్యాప్తి చెందుతూ రోగనిరోధక శక్తిని తప్పించు కుంటోంది. ఈ నేపథ్యంలో.. అసలు ఈ వేరియంట్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చిన్నారులు, వృద్ధుల విషయంలో ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? అన్న అంశాలపై వైద్య నిపుణులు అందించిన మార్గదర్శకాలు మీకోసం..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
కొత్త వేరియంట్ 'సబ్-క్లేడ్ కె' (Subclade-K) పట్ల భయపడాల్సిన పనిలేదు కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఎలాంటి వైరస్ ను అయినా సరే.. రోగనిరోధక శక్తి అవసరం. అందుకోసం పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి..
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం (Immunity Boosting Diet)..సిట్రస్ ఫ్రూట్స్.. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అల్లం, వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గించి, వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి.
రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపు వేసిన పాలు తాగడం వల్ల శరీరానికి యాంటీ సెప్టిక్ లక్షణాలు అందుతాయి. పప్పు ధాన్యాలు, గుడ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం వైరస్‌ను త్వరగా ఎదుర్కోగలదు. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు..
జ్వరం రాగానే సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకండి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి, యాంటీబయాటిక్స్ పనిచేయవు. కేవలం వైద్యుల సలహాతోనే మందులు వాడాలి. సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం వల్ల వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. తుమ్ముతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండటం మంచిది.
ఇన్ ఫ్లూయెంజా (Flu Shot) టీకా తీసుకోవడం వల్ల ఈ కొత్త వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉండకుండా కాపాడుకోవచ్చు. వైరస్ ఏదైనా సరే.. అప్రమత్తత, సరైన పోషకాహారం ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
