Front-Loading Calories : ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్ అంటే ఏమిటి..? బరువు తగ్గడంలో దీని పాత్ర..? 

షేర్ చేయండి:
Front-Loading Calories : ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్ అంటే ఏమిటి..? బరువు తగ్గడంలో దీని పాత్ర..? 

సాక్షి లైఫ్ : జిమ్‌ కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ 'ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్' కాన్సెప్ట్ మీ కోసమే. రోజులో మీరు తీసుకునే క్యాలరీలను ఉదయం, మధ్యాహ్నం లోపే తీసుకుంటే మీ శరీరం కొవ్వును కరిగించే యంత్రంలా మారుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం ఎప్పుడు తింటున్నామనే దానికంటే, ఎంత తింటున్నామనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం.

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

కానీ, పోషకాహార నిపుణుల తాజా పరిశోధనల ప్రకారం.. మనం తీసుకునే ఆహారం 'పరిమాణం' తో పాటు, అది తీసుకునే 'సమయం' (Timing) కూడా మన శరీర బరువును, జీవక్రియను (Metabolism) శాసిస్తుందని తేలింది. దీనినే శాస్త్రీయ పరిభాషలో 'ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్' (Front-loading calories) అని పిలుస్తున్నారు.

అసలేమిటీ ఫ్రంట్ లోడింగ్ క్యాలరీస్..?

సాధారణంగా చాలామంది ఉదయం అల్పాహారాన్ని తక్కువగా తీసుకుని, రాత్రి సమయంలో భారీగా భోజనం చేస్తుంటారు. అయితే, దీనికి భిన్నంగా.. రోజులో మనకు అవసరమయ్యే మొత్తం క్యాలరీలలో మెజారిటీ భాగాన్ని ఉదయం, మధ్యాహ్నం లోపే తీసుకోవడాన్ని 'ఫ్రంట్ లోడింగ్' అంటారు. అంటే "ఉదయం రాజులా, మధ్యాహ్నం సామాన్యుడిలా, రాత్రి పేదవాడిలా తినాలి" అన్న పాత సామెతకు ఇది ఆధునిక రూపం.

మెటబాలిజంపై ప్రభావం ఇలా..

మన శరీరం ఒక సర్కాడియన్ రిథమ్ (circadian rhythm) ప్రకారం పనిచేస్తుంది. దీనివల్ల పగటిపూట ఇన్సులిన్ సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది. ఉదయం పూట మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అదే రాత్రి పూట తీసుకునే ఆహారాన్ని కొవ్వుగా నిల్వ చేసే అవకాశం ఎక్కువ.

 ఉదయం భారీ అల్పాహారం చేయడం వల్ల 'గ్రెలిన్' అంటే..ఆకలిని ప్రేరేపించే హార్మోన్. ఇది అదుపులో ఉంటుంది. దీనివల్ల సాయంత్రం వేళల్లో జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. పగటిపూట క్యాలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది మధుమేహం బారిన పడకుండా కాపాడుతుంది.

 ఎలా అనుసరించాలి..?

అల్పాహారం (Breakfast): రోజు మొత్తం క్యాలరీలలో దాదాపు 40శాతం బ్రేక్ ఫాస్ట్ ద్వారా తీసుకునేలా ఉండాలి. ఇందులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు (Fibre) పుష్కలంగా ఉండాలి.

మధ్యాహ్న భోజనం (Lunch)..ఇది కూడా పోషకాలతో కూడిన ఆహారమై ఉండాలి. సుమారు 30 నుంచి 35శాతం క్యాలరీలు తీసుకోవచ్చు.

రాత్రి భోజనం (Dinner).. వీలైనంత తేలికగా ఉండాలి. సూప్‌లు, సలాడ్లు లేదా తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఉత్తమం. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే భోజనం ముగించాలి.

 ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు కేవలం జిమ్‌లో గంటలు, గంటలు వ్యాయామం చేయడమే కాదు, తమ ఆహారపు అలవాట్లలో ఈ చిన్న మార్పు చేసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చని, ప్రధానంగా సూర్యుడు ఉన్నప్పుడే జీర్ణక్రియ చురుగ్గా ఉంటుందని ఆ సమయంలోపే భోజనం చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.