కలబంద వ్యాధుల నివారణకే కాదు.. ఆహారంగానూ తినొచ్చు..  

సాక్షి లైఫ్ : ప్రపంచ దేశాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది.. వనరులు తగ్గిపోతున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మరిన్నేళ్ల తరువాత తినే తిండికీ పోటీ వచ్చేస్తుందన్న అనుమానాలు బలపడుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనై జేషన్ ఓ వినూత్న ఆలోచనకు తెరతీసింది. 

ఎడారుల్లో మాత్రమే పండే కలబంద మొక్కలతో భవిష్యత్ తరానికి ఆహార భద్రత ఇవ్వవచ్చునని ఈ సంస్థ అంటోంది. ముళ్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కలబందను పియర్స్ కాక్టస్ అని కూడా అంటారు. మెక్సికోలో పండే ఈ మొక్కలను ఏదో గాలికి పెరిగేవాటిగా కాకుండా ఆహార పంటగా పండించాల్సిన అవసరముందని ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని సూచిస్తోంది.

కొన్నేళ్ల క్రితం మడగాస్కర్లో కరువు వచ్చినప్పుడు కలబంద మొక్కలే ఆదుకున్నాయని, మనుషులకు ఆహారంగా.. దప్పికతీర్చే నీరుగా, పశుదాణాగానూ విస్తృతంగా వాడారని తెలిపింది ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనై జేషన్. 

మెక్సికన్లు ఈ మొక్కలను ఆహారంగా మాత్రమే కాకుండా షాంపూ మాదిరిగా, రకరకాల వ్యాధులకు మందులుగానూ వాడుతున్నారట. తన ఆకుల్లాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయగల ఈ మొక్కలు అటు నేల సారాన్ని పెంచేందుకూ పనికొస్తాయి.

 దాదాపు మూడు ఎకరాల నేలలో పండే కలబంద మొక్కల్లో ఏడాదికి దాదాపు 180 టన్నుల నీరు నిల్వ చేరుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. విపరీతమైన చలి, వేడి పరిస్థితుల్లో ఎదుగుదల మంద గించినా ఈ కలబంద మొక్కలతో మేలే ఎక్కువగా జరుగుతుందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో) అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి మొక్కలను ప్రోత్సహించాలని సూచిస్తోంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : aloe-vera
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com