Health Breaks Down : సెలవు పెడితే జీతం కట్..పెట్టకుంటే ఆరోగ్యం ఫట్..

సాక్షి లైఫ్ : అమెరికాలోని అలబామా రాష్ట్రంలో కార్మికులు ఇటీవల ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సెలవు తీసుకుంటే జీతం కట్ చేస్తున్నాయి అక్కడి కంపెనీలు. దీని కారణంగా సెలవు తీసుకోకుండా పని చేస్తే ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో అక్కడి కార్మికులు మానసిక ఆరోగ్య సెలవులను (Mental Health Leave) త్యాగం చేస్తూ, అనారోగ్యంతోనే విధులకు హాజరవుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

ఆదాయం తగ్గుతుందనే భయంతో.. 

అలబామాలో పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన అనారోగ్య సెలవులు (Paid Sick Leave) ఇచ్చే నిబంధనలు అలబామా రాష్ట్ర చట్టాల్లో లేవు. దీంతో ఒక కార్మికుడు తన మానసిక ప్రశాంతత కోసం సెలవు తీసుకోవాల్సి వస్తే, ఆ రోజు జీతాన్ని కోల్పోవాల్సి వస్తోంది.

ఆర్థిక పరంగా తీవ్రనష్టం..

సగటున ఒక కార్మికుడు నాలుగు వారాల పాటు వేతనం లేని సెలవు (Unpaid Leave) తీసుకుంటే, దాదాపు 2,900డాలర్లు అంటే సుమారు రూ. 2.40 లక్షల ఆదాయం కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.పెరుగుతున్న జీవన వ్యయం వల్ల చాలా మందికి సెలవు తీసుకునే వెసులుబాటు లేక, తీవ్రమైన మానసిక ఆందోళన ఉన్నప్పటికీ పనికి వెళ్తున్నారు.

 ఒత్తిడి..

అధ్యయనం ప్రకారం, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కార్మికుల్లో ఉత్పాదకత తగ్గడమే కాకుండా, దీర్ఘకాలికంగా వారు డిప్రెషన్ (depression), యాంగ్జైటీ (anxiety) వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వర్గాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది.

నివేదికలోని ముఖ్యాంశాలు.. 

అలబామాలో ప్రైవేట్ యజమానులు తమ ఉద్యోగులకు 'పెయిడ్ లీవ్' ఇవ్వాలనే నిబంధన లేదు. ఇది కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల మహిళలఆరోగ్యంపై కూడా తీవ్రప్రభావం పడుతోంది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి వల్ల మహిళా కార్మికులు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. ఉద్యోగులు అనారోగ్యపరిస్థితిలో పనిచేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక ఆరోగ్యం బాగుంటేనే ఉత్పాదకత పెరుగుతుంది. కానీ సెలవు తీసుకుంటే వచ్చే ఆర్థిక భారమే కార్మికులను మంచాన పడేలా చేస్తోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ అధ్యయనం నేపథ్యంలో అలబామాలో 'పెయిడ్ ఫ్యామిలీ అండ్ మెడికల్ లీవ్' చట్టం తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : mental-health depression tensions mental-tensions stress stress-mind office-work mental-stress working-out-and-depression shift-work
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com