Top Ten Medicines : బడ్జెట్‌ కు భారమవుతున్న టాప్ టెన్ మెడిసిన్స్..  

సాక్షి లైఫ్ : అమెరికా ఆరోగ్య బీమా వ్యవస్థ ‘మెడికేర్’పై మందుల ఖర్చు భారం ఏటేటా పెరుగుతోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం.. కేవలం పది రకాల మందుల కోసమే ప్రభుత్వం, సామాన్య ప్రజలు కోట్లాది డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులే ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..?

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

 

భారమవుతున్న మందులు ఇవే..

అమెరికా ఆరోగ్య బీమా వ్యవస్థ ‘మెడికేర్’ బడ్జెట్‌పై ఈ పది రకాల మందులు పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటిలో రక్తం గడ్డకట్టకుండా వాడే ఎలిక్విస్, జారెల్టో వంటి మందులతో పాటు, డయాబెటిస్ ,గుండె జబ్బుల చికిత్సలో వాడే జార్డియన్స్, ఫార్సీగా, జనువియా, ఎంట్రెస్టో, నోవోలాగ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు సోరియాసిస్ కోసం స్టెల్లారా, కీళ్ల వాతానికి ఎన్‌బ్రెల్, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో వాడే ఇంబ్రువికా మందులు అత్యధిక వ్యయం అయ్యే జాబితాలో చేరాయి.

భారం పెరగడానికి ప్రధానంగా కారణాలు..

ఈ మందుల వల్ల ప్రభుత్వంపై భారం పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వినియోగం విపరీతంగా పెరగడం, ఎలిక్విస్, జార్డియన్స్ వంటి మందులను లక్షలాది మంది వృద్ధులు నిత్యం వాడుతుండటంతో మొత్తం బిల్లు భారీగా పెరుగుతోంది. రెండవది, ఔషధాల అధిక ధరలు, ముఖ్యంగా ఇంబ్రువికా వంటి క్యాన్సర్ నివారణ మందులు వాడే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఒక్కో రోగికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉండటం వల్ల మెడికేర్ బడ్జెట్‌లో ఇవి సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ అధిక ధరల భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం తాజాగా ఔషధ కంపెనీలతో ధరల తగ్గింపుపై చర్చలు జరుపుతోంది.

2026 నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం' (IRA) కింద ఈ 10 రకాల మందుల ధరలను నేరుగా తయారీ కంపెనీలతో చర్చించి తగ్గించనున్నారు. కొన్ని మందులపై గరిష్టంగా 79 శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీనివల్ల 2026 నాటికి మెడికేర్ వ్యవస్థకు సుమారు 6 బిలియన్ డాలర్లు, సామాన్య ప్రజలకు 1.5 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ధరల తగ్గింపు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల ముఖ్యంగా వృద్ధులకు మందుల ఖర్చు భారం నుంచి పెద్ద ఉపశమనం లభించనుంది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : diabetes heart-problems usa america cancer-tablet medicines pharmaceutical-companies pharmaceutical-regulations fda fdc-medicines alternative-medicine american-association-for-cancer-research
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com