Bird Flu Crisis : 'బర్డ్ ఫ్లూ' తీవ్రతపై ఫ్రాన్స్ ప్రభుత్వం 'హై అలెర్ట్'..  

షేర్ చేయండి:
Bird Flu Crisis : 'బర్డ్ ఫ్లూ' తీవ్రతపై ఫ్రాన్స్ ప్రభుత్వం 'హై అలెర్ట్'..  

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని వణికిస్తున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బర్డ్ ఫ్లూ ప్రమాద స్థాయిని 'మితం' (Moderate) నుండి 'అత్యధికం' (High) స్థాయికి పెంచుతూ దేశవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించింది. వలస పక్షుల ద్వారా వ్యాధి వేగంగా తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కట్టు దిట్టమైన చర్యలు చేపట్టింది. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 


వ్యాప్తికి కారణం ఏమిటంటే..? 

ఐరోపా ఖండంలో శీతాకాలం సమీపిస్తుండటంతో వలస పక్షుల రాకపోకలు మొదలయ్యాయి. ఈ వలస పక్షులలో (ముఖ్యంగా స్పేయిన్, జర్మనీ వైపుల నుంచి వచ్చే పక్షులలో) హెచ్5ఎన్1 (H5N1) వైరస్ తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందిన సమాచారం ప్రకారం, కేవలం కొన్ని రోజుల్లోనే వాణిజ్య కోళ్ల ఫారాల్లో, అలాగే ఇళ్లలో పెంచుకునే కోళ్లలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అట్లాంటిక్ వలస మార్గంలోనే గుర్తించారు. 

ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు.. 

'అత్యధిక' ప్రమాద స్థాయి (High Alert) కారణంగా ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా ఆదేశాలను జారీ చేసింది. కోళ్ల ఫారాల్లోని అన్ని రకాల పక్షులను తప్పనిసరిగా ఫారం లోపల ఉంచాలి. బయటి వాతావరణంలో, ముఖ్యంగా వలస పక్షులతో సంబంధం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పాటించాలి. కోళ్ల ఫారాల వద్ద బయోసెక్యూరిటీ చర్యలను మరింత కఠినతరం చేశారు. వ్యాధి లక్షణాలను నిశితంగా పర్యవేక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఫ్రాన్స్ సర్కారు.
 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.