తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం..  

సాక్షి లైఫ్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్‌ నిర్ధారణ అయింది. పూణేలోని ల్యాబ్‌ కు కోళ్ల శాంపిల్స్‌ పంపగా పరీక్షించిన పరిశోధకులు బర్డ్ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టేందుకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు కొన్ని కీలకమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

 

బర్డ్ ఫ్లూ నిర్ధారణ..  

తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీ ఫార్మ్‌లలో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్‌ నిర్ధారణ అయ్యింది.
పూణేలోని ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించిన తరువాత ఈ వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

 చర్యలు.. 

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశాల మేరకు, కానూరు గ్రామ పరిసర ప్రాంతంలో ఒక కిలోమీటర్‌ పరిధిలో రెడ్ జోన్ ప్రకటించారు. పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ అమలు చేస్తున్నారు.

కర్ఫ్యూ..

రెడ్ జోన్ పరిధిలో 144, 133 సెక్షన్లను అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్. ఈ వైరస్ వచ్చిన ప్రాంతాలలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ, ప్రజల సంక్రమణ నివారణ చర్యలు చేపడుతున్నారు.

 నివారణకు ప్రజలకు సూచనలు:

బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్‌ వంటకాలను తినడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వివిధ ప్రాంతాల్లో కోళ్లు మృతి..  

నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు వంటి ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందాయి.

 ఆరోగ్య పర్యవేక్షణ.. 

కోళ్ల ఫారాలలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనించేందుకు ప్రత్యేక ర్యాపిడ్‌ టీమ్‌లను నియమించారు. చనిపోయిన కోళ్లను సురక్షితంగా ఖననం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

 సూచనలు..  

కోళ్లు మృతికి సంబంధించి లేదా బర్ద్ ఫ్లూ కు సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులను గమనిస్తే, వెంటనే స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bird-flu bird-flu-symtoms bird-flu-case birds andhra-pradesh public-health poultry-farms h5n1 bird-flu-symptoms bird-flu-virus birdhouse-gourd red-alert telangana-state bird-flu-death viruses bird-flu-in-humans bird-flu-effect-on-humans bird-flu-news bird-flu-symptoms-in-birds bird-flu-effect-on-human-brain bird-mortality-due-to-air-pollution what-is-bird-flu bird-flu-outbreak peravali kaanuru poultry h5n1-virus east-godavari red-zone surveillance-zone
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com