Swine Flu : జ్వరం లేకపోయినా 'స్వైన్ ఫ్లూ' వస్తుందా..? ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా హెచ్1ఎన్1 (H1N1) స్వైన్ ఫ్లూ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కేవలం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ కలకలం రేపుతోంది. అయితే, ఫ్లూ బారిన పడితే తప్పకుండా అధిక జ్వరం రావాల్సిందేననే అపోహ చాలామందిలో ఉంది. కానీ, జ్వరం లేకపోయినా హెచ్1ఎన్1 సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

 

గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

ఢిల్లీలో భారీ పెరుగుదల.. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఒక్క ఢిల్లీలోనే స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య 3,200 దాటింది. గడిచిన ఏడేళ్ల రికార్డులను ఈసారి ఈ వైరస్ తిరగరాయడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోనూ విస్తరణ.. సెప్టెంబర్ 2 నాటికి ఉత్తరప్రదేశ్‌లో ల్యాబ్ పరీక్షల ద్వారా అధికారికంగా 685 హెచ్1ఎన్1 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మరణాలు కూడా నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరికి ఎక్కువ ముప్పు అంటే ..?

 ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం, సాధారణ వ్యక్తుల్లో దీని లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, మధుమేహం (diabetes) రోగులు, గర్భిణులు, చిన్నారులు తీవ్రమైన ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.

జ్వరం లేకపోయినా ఫ్లూ ఎలా వస్తుంది..?

ఇన్ఫ్లూఎంజా ఏ వైరస్ రకానికి చెందిన హెచ్1ఎన్ 1 సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావడమే ప్రధాన లక్షణంగా భావిస్తుంటాం. అయితే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా జ్వరం రావాలనే నియమం ఏమీ లేదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక వెల్లడిస్తోంది.

సాధారణ లక్షణాలు..

జ్వరం లేకపోయినా విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అధిక అలసట వంటి లక్షణాలు కనిపిస్తే దానిని కేవలం సాధారణ జలుబుగా కొట్టిపారేయకూడదు.

వృద్ధులు, పిల్లల్లో భిన్నమైన లక్షణాలు..

వృద్ధులలో జ్వరం లేకపోయినా తీవ్రమైన నీరసం, ఆకలి మందగించ డం వంటి ఇతర లక్షణాల ద్వారా ఫ్లూ సోకినట్లు గుర్తించవచ్చు. ఇక పిల్లల్లో వాంతులు, విరేచనాలు (diarrhea) వంటి సమస్యలు ఎక్కువ గా కనిపించే అవకాశం ఉంది.

వైద్య నిపుణుల హెచ్చరిక..

దగ్గు, గొంతు నొప్పులు వంటి లక్షణాలు కేవలం స్వైన్ ఫ్లూలోనే కాకుండా ఇతర శ్వాసకోశ ఇబ్బందుల్లోనూ కనిపిస్తాయని ఫ్యామిలీ ఫిజీషియన్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేవలం లక్షణాలను మాత్రమే చూసి స్వయంగా నిర్ధారించుకోకుండా, స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.