టీబీ రోగులకు అందించే సహాయాన్ని రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి లైఫ్ : టీబీ రోగులకు అందించే పోషకాహారం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. మొత్తం రెండింతలు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రకటన చేస్తూ, టీబీ రోగులకు పోషకాహార సహాయ పథకానికి రూ.1040 కోట్ల అదనపు కేటాయింపులకు ఆమోదం తెలిపారు. టీబీ రహిత దేశంగా మారేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచే ఏడు ఆహారాలు..
టిబి రోగులకు అందించే ఆర్ధిక సహాయాన్ని..
చికిత్స సమయంలో టిబి రోగులకు అందించే ఆర్ధిక సహాయాన్ని మరింతగా పెంచారు. క్షయ వ్యాధి ఉన్నవారికి పోషకాహారాన్ని అందించే పథకానికి మరికొన్ని నిధులు కేటాయించారు. నిక్షయ్ పౌష్టికాహార పథకం కింద టీబీ రోగులకు నెలవారీ పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. చికిత్స సమయంలో టీబీ రోగులందరికీ ఈ సహాయం అందిస్తారు.
టీబీ రోగులకు పోషకాహార సహాయ పథకానికి అదనంగా రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం టీబీ రహిత దేశంగా మార్చడానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
