సాక్షి లైఫ్ : హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు శరీరం సక్రమంగా పనిచేయాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడా ఉండాలి. పురుషులకు 14 నుంచి 18 గ్రాములు, స్త్రీలకు 12 నుంచి16 గ్రాముల వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినప్పుడు, బలహీనత, అలసట, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల..
హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ఐరన్-కలిగిన ప్రోటీన్. రక్తంలోని ఆక్సిజన్‌ను వివిధ అవయవాలు, శరీర కణజాలాలకు తీసుకెళ్లడంలో హిమోగ్లోబిన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరానికి తగిన హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల హృదయ స్పందన వేగం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి గణనీయంగా పడిపోతే, అది రక్తహీనతగా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఆయా లక్షణాలు తీవ్రంగా ఉంఉంటాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
యుక్తవయస్సులో ఉన్న భారతీయ బాలికల్లో దాదాపు 56శాతం మందికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. హిమోగ్లోబిన్ ఉత్పత్తి విషయంలో ఐరన్, బి విటమిన్లు, అలాగే విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హిమోగ్లోబిన్ సరైన స్థాయిని నిర్వహించడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.. అవేంటంటే..?
నేషనల్ అనీమియా యాక్షన్ కౌన్సిల్ ప్రకారం.. రక్తహీనత, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలకు ఇనుము లోపం ఒక సాధారణ కారణం. పాలకూర, బీట్‌రూట్ తదితరాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తగిన హిమోగ్లోబిన్ ను పొందవచ్చు. యాపిల్స్, దానిమ్మ, పుచ్చకాయ, గుమ్మడి గింజలు, ఖర్జూరాలు, బాదం, ఎండుద్రాక్ష వంటివి తీసుకోవడం చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. నారింజ, నిమ్మకాయలు మరియు స్ట్రాబెర్రీ నుండి బొప్పాయి, బ్రోకలీ, ద్రాక్ష, టమోటాలు వంటి ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.
హిమోగ్లోబిన్ లోపానికి దానిమ్మ తీసుకోవడం ఉత్తమం. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచడం ద్వారా రక్తహీనతను నివారిస్తుంది. దానిమ్మను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ విటమిన్, ఎర్ర రక్త కణాల తయారీకి అవసరం. ఆకు కూరలు, వేరుశెనగలు, అరటిపండ్లు , బ్రకోలీ ఫోలిక్ యాసిడ్ కు మంచి మూలాలు. బీట్‌రూట్ శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో కూడా సహాయపడుతుంది. నైట్రేట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల మీ రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
రక్తంలో హిమోగ్లోబిన్‌ను నిర్వహించడానికి, పెంచడానికి ప్రతి రోజూ ఒక యాపిల్ తినాలి. ఖర్జూరం పోషకాల భాండాగారం. ఖర్జూరాలను ఇతర పండ్లతో పోల్చితే వాటిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖర్జూరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నందున వాటిని తినకూడదని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..కాల్షియం సమృద్ధిగా లభించే ఐదు ఆహారాలు..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com