Cicada Variant Impact : పిల్లలపైనే సికాడా ప్రభావం ఎక్కువ : శాస్త్రవేత్తలు

షేర్ చేయండి:
Cicada Variant Impact : పిల్లలపైనే సికాడా ప్రభావం ఎక్కువ : శాస్త్రవేత్తలు

సాక్షి లైఫ్ : కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన 'BA.3.2' అనే కొత్త వేరియంట్ ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి 'సికాడా' (Cicada) అని పేరు పెట్టారు. భూమి అడుగున ఏళ్ల తరబడి ఉండి, ఒక్కసారిగా బయటకు వచ్చే 'సికాడా' కీటకం లాగే, ఈ వైరస్ కూడా చాలా కాలం తర్వాత మళ్లీ వెలుగులోకి రావడంతో దీనికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

 చిన్నారులతోపాటు, వృద్ధుల్లో..  

సాధారణంగా కోవిడ్ వేరియంట్లు వృద్ధులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ, ఈ 'సికాడా' వేరియంట్ అందుకు విరుద్ధంగా చిన్నారులపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) నివేదిక ప్రకారం, ఈ వేరియంట్ సోకిన వారిలో అత్యధికులు పిల్లలే ఉండటం గమనార్హం.

తీవ్రత తక్కువే..

ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల్లో గానీ, పెద్దల్లో గానీ ప్రాణాంతక మైన లక్షణాలను కలిగించడం లేదు. అయితే వైరస్ తన స్వభావాన్ని మార్చుకుని వృద్ధుల నుంచి పిల్లల వైపు మళ్లడం అనేది పరిశోధించా ల్సిన విషయమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే 23 దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అమెరికాలోని 25 రాష్ట్రాల మురుగునీటి నమూనాల్లో (Wastewater) ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించాయి. తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయకపోయినా, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పెద్దల కంటే పిల్లలపై ఎక్కువగా ప్రభావం..

 ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, పరీక్షల సంఖ్య తగ్గడం వల్ల ఈ వేరియంట్ మనకు తెలియకుండానే విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ తన పద్ధతిని మార్చుకుని పెద్దల కంటే పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపడం అనేది ఒక కీలక పరిణామం. దీని ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే వేరియంట్లను అడ్డుకోవడం సులభమవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో సాధారణ జలుబు, దగ్గు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి కనీస జాగ్రత్తలు అనుసరించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.