యూకేలో ప్రమాదకరమైన వైరస్..

షేర్ చేయండి:
యూకేలో ప్రమాదకరమైన వైరస్..

సాక్షి లైఫ్ : యూకేలో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు. దానిపేరు "వెస్ట్ నైల్ వైరస్" యూకేలో మొదటిసారిగా ఈ కొత్త వైరస్ ను కనుగొన్నారు. ఇది దోమల ద్వారా మానవులకు వ్యాపించే వైరస్. క్యూలెక్స్ అనే దోమ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఒక వైపు, కోవిడ్-19 కొత్త వేరియంట్ కారణంగా భారతదేశం, సింగపూర్ వంటి దేశాలు భయాందోళనలో ఉన్నాయి. అదే సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరొక వైరస్ వ్యాపిస్తోంది. వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తికి సంబంధించి అక్కడి దోమలలో కనుగొన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. వెస్ట్ నైల్ వైరస్ సాధారణంగా పక్షులలో వ్యాపిస్తుందని, కానీ దోమ కాటు కారణంగా ఇది మానవులకు, ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తోందట. 

ప్రస్తుతం యూకేలో పరిస్థితి సాధారణంగానే ఉంది. అక్కడి ఆరోగ్య యంత్రాంగం పరిస్థితిపై నిఘా ఉంచింది. సాధారణంగా ఈ వైరస్ యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.