Drugs Control Administration : మత్తు మందులు, అబార్షన్ కిట్లపై ‘డ్రగ్స్’ డీసీఏ ఉక్కుపాదం
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ మెరుపు దాడులు చేస్తోంది. ఇప్పటికే అధికారులు180 మెడికల్ షాప్ లకు నోటీసులు ఇవ్వగా ప్రాణాపాయంగా మారుతున్న అడ్డగోలు అమ్మకాలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీ షానవాజ్ ఖాసిం వెల్లడించారు. యువతను వ్యసనాల ఊబిలోకి నెట్టే మత్తు కలిగించే మందులు (Habit-forming drugs), నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న గర్భస్రావ మాత్రల (Abortion kits)పై రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం (DCA) కొరడా ఝుళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలు పాటించని 180 మందుల దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
నిబంధనలు గాలికొదిలేసి..
గత కొంతకాలంగా రాష్ట్రంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని రకాల మత్తు మందులు, గర్భస్రావ కిట్లు విక్రయిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన డీసీఏ బృందాలు.. రిటైల్ మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ప్రధానంగా షెడ్యూల్ H, H1 జాబితాలోకి వచ్చే మందుల అమ్మకాలపై దృష్టి సారించారు.
తనిఖీల్లో లోపాలు..
వైద్యుల సూచన లేకుండానే అత్యంత ప్రమాదకరమైన మత్తు కలిగించే మాత్రలు విక్రయిస్తున్నారు. మెడికల్ షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నారు. అంతేకాదు అమ్మకాలకు సంబంధించి సరైన బిల్లులు లేకపోవడం, రిజిస్టర్లను నిర్వహించకపోవడం జరుగుతుంది.
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
అబార్షన్ కిట్లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం వల్ల మహిళల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. "ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం" అని డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం స్పష్టం చేశారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే మత్తు మందులు, అబార్షన్ మాత్రల వల్ల ప్రాణాపాయం సంభవించవచ్చు. ఇలాంటి అక్రమ అమ్మకాలపై సమాచారం ఉంటే డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
