Central Government Launches New Scheme : 40 ఏళ్లు దాటిన కార్మికులకు 'ఆరోగ్య' భరోసా..! ఏటా ఉచిత పరీక్షలు కేంద్ర ప్రభుత్వ నూతన పథకం ప్రారంభం..

సాక్షి లైఫ్ : దేశంలోని కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ప్రతి ఏటా ఉచితంగా వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈఎస్‌ఐసీ (ESIC) ద్వారా దేశవ్యాప్త ఉచిత వైద్య తనిఖీల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. కార్మికులకు వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు.

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఉచితంగా మందులు, చికిత్స.. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య పరీక్షల సమయంలో ఏదైనా అనారోగ్యం బయటపడితే, సదరు కార్మికులకు ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తామని స్పష్టం చేశారు. "వ్యాధిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే ఈ ముందస్తు పరీక్షల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాం" అని ఆయన పేర్కొన్నారు. దేశంలో సామాజిక భద్రతా కవరేజీ గత పదేళ్లలో 19 శాతం నుంచి 64 శాతానికి పెరిగిందని, లబ్ధిదారుల సంఖ్య 94 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.

మహిళా కార్మికులకు అండగా సంస్కరణలు.. 

కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన నూతన సంస్కరణల వల్ల మహిళా ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరుతోందని మంత్రి వివరించారు.

పురుషులతో సమానంగా మహిళలకు సమాన వేతన హక్కు కల్పించారు.

ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు.

అవసరమైన చోట 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునే వెసులుబాటు కల్పించారు.

మాతా,శిశువుల ఆరోగ్యం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌..

తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య శాఖ 'జనని' (Janani) అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది. గర్భిణీలు, బాలింతలు మరియు శిశువుల ఆరోగ్య రికార్డులను ఇందులో డిజిటలైజ్ చేస్తారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు, ఆపై శిశువు సంరక్షణ, టీకాలు, కుటుంబ నియంత్రణ వంటి అంశాలన్నింటినీ ఈ పోర్టల్ ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. ఇది పాత ఆరోగ్య పోర్టల్ కు అధునాతన వెర్షన్ అని అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates health-care-tips health-problem government-scheme health-scheme central-government-schemes
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com